Mumbai rains: IMD వార్నింగ్ -సిటీ సహా థానే, ఫల్‌ఘర్‌, రాయ్‌గఢ్ జిల్లాల్లో రెడ్ అలర్ట్ -వచ్చే 3రోజులు భారీగా

కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం కాస్త తగ్గిందనుకునేలోపే మహారాష్ట్రను, ప్రత్యేకించి ముంబై మహానగరాన్ని వర్షాలు చుట్టుముట్టాయి. నైరుతి రుతుపవనాల ఆగమనంతో మహారాష్ట్రలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు జరుగా కురుస్తున్నాయి. బుధవారం కురిసిన వర్షాలకు ముంబై, థానే నగరాలు తడిసిముద్దయ్యాయి. ఆర్థిక రాజధాని ముంబైలో జనజీవనం అతలాకుతలం అయింది..

Recommended Video

    Woman BMC Worker Dedication జోరు వానలో విధులు.. Anand Mahindra Salutes || Oneindia Telugu

    ముంబైలో రైల్వేట్రాక్స్, రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో రైలు, బస్సు సర్వీసులు దాదాపు నిలిచిపోయాయి. మంగళవారం నుంచి కురుస్తోన్న వానలు బుధవారానికి ఇంకాస్త పెరగ్గా, భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తన తాజా అప్ డేట్ లో సిటీకి హెచ్చరిక జారీ చేసింది. రాబోయే నాలుగు రోజులపాటు ముంబైకి రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. అలాగే,

    mumbai-rains-imd-issues-red-alert-for-city-and-orange-alert-to-palghar-thane-for-next-3days

    ముంబై నగరం తోపాటే థానే, ఫల్‌ఘర్‌, రాయ్ గఢ్ జిల్లాలకు కూడా ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముంబైతోపాటు ఆ మూడు జిల్లాల్లో ఈనెల 13 వరకు భారీ వర్షపాతం నమోదవుతుందని వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలను చేపట్టింది.

    మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ముంబైలోని తన కార్యాలయం నుంచి భారీ వర్షాలపై సమీక్షలు జరిపారు. నీట మునిగిన ముంబై నగరంలో సహాయక చర్యల్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. మరో నాలుగురోజులపాటు భారీ వర్షాలు కురవనున్నాయన్న ఐఎండీ హెచ్చరిక నేపథ్యంలో అన్ని జిల్లాల యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఠాక్రే సూచించారు. బీఎంసీ మేయర్ తోపాటు సిబ్బంది అంతా విపత్తు నిర్వహణలో పాలుపంచుకున్నారు. కాగా,

    వర్షాలకుతోడు మహారాష్ట్రలో కరోనా కేసులు భారీగానే నమోదయ్యాయి. బుధవారం కొత్తగా 10,989 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 58,63,880కు పెరిగింది. 24 గంటల్లో కొవిడ్‌తో మరో 261 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 1,01,833కు చేరింది. బుధవారం మరో 16,379 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 95.45శాతంగా ఉంది. మరణాల రేటు 1.74గా ఉంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+