ముంబై: పాకిక్షంగా పునరుద్దరించిన లోకల్ ట్రైన్స్, స్కూల్స్, కాలేజీలకు సెలవులు

ముంబై: ముంబైలో భారీ వర్షాలు ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలతో ముంబైలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో మహరాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

ముంబై నగరంలోని కొన్ని ప్రాంతాల్లో 200 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఈ భారీ వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కారణంగా సహయక చర్యల కోసం ప్రభుత్వం ఏర్పాట్లను చేస్తోంది.

Mumbai Rains: Local trains partially resume; schools to stay shut tomorrow

నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలతో లోకల్ రైళ్ళను రద్దు చేశారు. అయితే కొన్ని ప్రాంతాల్లో లోకల్ టైన్ల రాకపోకలను పునరుద్దరించారు.

భారీ వర్షాల కారణంగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. వాతావరణం సరిగా లేని కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని అధికారులు ప్రకటించారు.

స్కూళ్ళు, కాలేజీలకు ఆగష్టు 30న, సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.అత్యవసర పరిస్థితుల కోసం వెంటనే అధికారుల సహయం తీసుకోవాలని ప్రభుత్వం ప్రజలను కోరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+