ముంబైలో ఒమిక్రాన్ కలకలం: కొత్తగా 8 కేసులతో రాష్ట్రంలో మొత్తం 28, దేశంలో 57కి చేరిన కేసులు
ముంబై: మహారాష్ట్రలో కరోనావైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలం రేపుతోంది. ఈ వేరియంట్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా, ముంబైలో ఎనిమిది ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. ముంబైలోని వాసాయి విహార్ ప్రాంతంలో ఈ కేసులు గుర్తించారు. మంగళవారం నమోదైన కొత్త కేసులతో మహారాష్ట్రలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 28కి చేరింది.
అంతకుముందు రోజు, ఢిల్లీలో నాలుగు కొత్త ఓమిక్రాన్ కేసులు కూడా కనుగొనబడ్డాయి, దీంతో దేశ రాజధానిలో మొత్తం కేసుల సంఖ్య ఆరుకు చేరింది. ఆరు కేసుల్లో ఒకరు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు.

మొత్తం ఆరుగురి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, తేలికపాటి నుంచి మితమైన లక్షణాలను కలిగి ఉన్నారని అధికారులు తెలిపారు. కాగా, కొత్త కోవిడ్-19 వేరియంట్‌ను నివేదించిన ఇతర రాష్ట్రాల జాబితా గుజరాత్ (4), రాజస్థాన్ (9), ఢిల్లీ (6) కర్ణాటక (3), కేరళ (1), ఆంధ్రప్రదేశ్ (1), చండీగఢ్ కేంద్ర పాలిత ప్రాంతం (1) .
కాగా, మంగళవారం ఒక్కరోజే భారతదేశంలో కొత్తగా 16 ఒమిక్రాన్ కేసులు వెలుగుచూడటం గమనార్హం. వీరిలో ఎవరూ విదేశాలకు ప్రయాణించలేదని తెలుస్తోంది. తాజా కేసులతో దేశంలో నమోదైన మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 57కి చేరింది.
కొత్తగా ఒమిక్రాన్ బారినపడిన ఎనిమిది మందిలో ఒకరు ఢిల్లీ, మరొకరు బెంగళూరుకు ప్రయాణించినట్లు అధికారులు వెల్లడించారు. వీరందరిలో ఒక్కరు మాత్రమే టీకా తీసుకున్నట్లు సమాచారం. వీరంతా కూడా 24 నుంచి 41 ఏళ్ల మధ్య వయసు కలిగినవారే కావడం గమనార్హం. ముగ్గురిలో ఎలాంటి లక్షణాలు కనబడకపోగా, మరో ఐదుగురిలో మాత్రం స్వల్ప లక్షణాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఒమిక్రాన్ సోకినవారిలో ముగ్గురు మహిళలు కాగా, ఐదుగురు పురుషులు ఉన్నారు. వీరిలో ఇద్దరు ఇస్పత్రిలో చేరగా, ఆరుగురు హోంఐసోలేషన్లో ఉన్నారు. ఇక మహారాష్ట్రంలో నమోదేన 28 ఒమిక్రాన్ కేసుల్లో ముంబై నుంచి 12, పింప్రీ-చింద్వార్ లో 10, పుణె మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రెండు, కళ్యాణ్ దొంబివిలి, నాగపూర్ లాతూర్, వాసాయి విహార్ లలో ఒక్కొక్కటి చొప్పున వెలుగుచూశాయి. ఇప్పటి వరకు 9 మంది కోలుకుని డిశ్చార్జయ్యారు. మరో 19 మంది చికిత్స తీసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications