వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహాశివరాత్రి రోజున తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ తల్లైంది

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

ముంబై: తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ తల్లైంది. ముంబైలోని ఓ జంటకు 1986లో పుట్టిన హర్షా చవ్దా షా.... ముంబైలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇక్కడ విశేషం ఏమిటంటే 29 ఏళ్ల క్రితం హర్షా చవ్దా షా జన్మించేందుకు ఏ వైద్య బృందం టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతిని అనుసరించారో... అదే వైద్యుల బృందం ప్రస్తుతం హర్షాకు ప్రసవం చేశారు.

హర్షా చవ్దా షాకు సాధారణ డెలివరీ అయ్యే అవకాశాలు తక్కువగా ఉండటంతో సిజేరియన్ పద్ధతిలో శిశువుని బయటికి తీశారు. మహాశివరాత్రి రోజైన మార్చి 7వ తేదీన హర్షాకు పండంటి మగబిడ్డ పుట్టాడని కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, హర్షాకు 2015లో దివ్యపాల్ షాతో వివాహమైంది.

సహజ పద్ధతిలోనే ఆమె గర్భం దాల్చింది. ముంబైలోని మాతుంగా సబ్ అర్బన్‌లో నివసించే హర్షా ఈ క్రమంలో ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ఉండేందుకు ఉద్యోగానికి కూడా రాజీనామా చేసింది. ఈ సందర్భంగా హర్షా చవ్దా షాకు ప్రసవం చేసిన వైద్యులు మాట్లాడుతూ టెస్ట్ ట్యూబ్ బేబీగా హర్షని పుట్టించిన తర్వాత తాము 15,000 మంది టెస్ట్ ట్యూబ్ బేబీలను పుట్టించామన్నారు.

Mumbai's First Test Tube Baby Becomes A Mom On Mahashivratri

హర్ష తల్లికావడం ద్వారా టెస్ట్ ట్యూబ్ బేబీలు సైతం అందరిలాంటి సాధారణ జీవితాన్ని గడుపగలరనే విషయాన్ని.. సహజ పద్ధతిలోనే గర్భం ధరిస్తారనే సంగతిని లోకానికి ఎత్తిచూపినట్లయిందని వైద్యులు పేర్కొన్నారు. హర్ష జన్మనిచ్చిన మగ శిశువు పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

నాలుగు లేదా ఐదు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేయనున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ సందర్భంగా హర్ష మాట్లాడుతూ 'నేనే ఒక దేవుడి బహుమతిని.. నాకు పండంటి మగశిశువు పుట్టాడు. వాడు నన్ను ఆశీర్వదించడానికి జన్మించాడు. ఈ ఆనందం ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు' అని చెప్పింది.

English summary
Twenty-nine years after she became famous as Mumbai's first test tube baby, Harsha Chawda Shah is now herself a proud mother of a baby boy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X