బంగారమే: ఉల్లిగడ్డలు ఎత్తుకెళ్లిన దొంగలు

బుధవారం దుకాణం వద్దకు చేరుకున్న యజమాని ఇశార్దాస్ ఆచార దొంగతనం జరిగిందని గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఆచార ఫిర్యాదు చేశాడు. తన దుకాణం షెటర్‌ను పగలగొట్టిన దొంగలు షాపులోని ఐదు గోనె సంచుల్లో నిల్వ చేసిన ఉల్లిపాయలను ఎత్తుకుపోయారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే అతని ఫిర్యాదును లైట్‌గా తీసుకున్న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు.
తన దుకాణంలో ఉన్న ఏ ఇతర సామాగ్రిని ముట్టుకోని దొంగలు ఆ ఐదు ఉల్లిపాయల సంచులను మాత్రమే దొంగతనం చేశారని ఇశార్దాస్ ఆచార చెప్పారు. పక్కనే ఉన్న ఆలుగడ్డల సంచులను దొంగలు ముట్టుకోలేదని ఆయన తెలిపారు. ఉల్లిపాయలను 65 రూపాయలకు కొనుగోలు చేసిన యజమాని 70 రూపాయలకు అమ్మాలనుకున్నట్లు తెలిపారు.
అయితే ఉల్లిపాయల కంటే చాలా తక్కువగా కిలోకు 20 రూపాయలు ఉండడంతో దొంగలు ఆలుగడ్డలను ఎత్తుకెళ్లలేదేమో అని ఆచార తెలిపారు. దుకాణ యజమాని నుంచి ఫిర్యాదు స్వీకరించామని, దొంగతనంపై విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. నిందితులను పట్టుకున్న తర్వాత కేసు నమోదు చేస్తామని పోలీస్ ఇన్‌స్పెక్టర్ అశోక్ సాక్పల్ తెలిపారు.












Click it and Unblock the Notifications