వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరుగుదొడ్డి కోసం తాళి విక్రయం: పంకజ సత్కారం

By Pratap
|
Google Oneindia TeluguNews

ముంబై: మరుగుదొడ్డి నిర్మాణం కోసం ఓ మహారాష్ట్ర మహిళ మంగళసూత్రాన్ని విక్రయించింది. సంగీత అవ్హాలే అనే ఆ మహిళను మహారాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పంకజ ముండే గురువారంనాడు సత్కరించారు. మహారాష్ట్రలోని వాషిం జిల్లాలో గల సైఖేడా గ్రామానికి చెందిన సంగీత మరుగుదొడ్డిని కట్టుకోవడానికి తన మెడలోని తాళిని విక్రయించింది.

ఆభరణాలతో పోలిస్తే మరుగుదొడ్డి ప్రాథమిక ఆవసరమని, తన ఆభరణాలను అన్నింటినీ విక్రయించి టాయిలెట్ నిర్మించుకోవాలని నిర్ణయం తీసుకున్నానని సంగీత ముండై కార్యాలయంలో మీడియాతో చెప్పారు. దేశంలోని, రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో టాయిలెట్లు లేవని, దాంతో మహిళలు తీవ్ర సమస్యను ఎదుర్కుంటున్నారని పంకజ ముండే అన్నారు.

 Mumbai woman who sold 'mangalsutra' to build toilet honoured

శాసనసభ్యురాలిగా తన తొలి విడతనే మరుగుదొడ్ల నిర్మాణానికి 25 శాతం నిధులు కేటాయిస్తూ వచ్చానని ఆమె చెప్పారు. సాధ్యమైనంత ఎక్కువ సంఖ్యలో మరుగుదొడ్లను నిర్మించాలనేది తమ లక్ష్యమని, మహిళలు ఏ విధమైన ఇబ్బందులకు గురి కాకూడాదనేది ఉద్దేశమని ఆమె అన్నారు.

సంగీత చొరవను పంకజ ముండే ప్రశంసించి, కొత్త మంగళసూత్రాన్ని ప్రదానం చేశారు. మరుగుదొడ్ల నిర్మాణం విషయంలో చైతన్యం పెంచాలనే ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యాన్ని ముందుకు తీసుకుని పోవడానికి చొరవ చూపినందుకు ప్రశంసగా సంగీతకు ఆ బహుమతి ఇచ్చినట్లు పంకజ ముండే చెప్పారు.

English summary
Maharashtra rural development minister Pankaja Munde on Thursday honoured Sangita Awhale, a woman from Saikheda village in Washim district, who sold her 'mangalsutra' to build a toilet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X