Murder case: భర్త చేసిన పని, 11 ఏళ్లు జైల్లో భార్య, చివరికి చంపలేదని కేసు నుంచి విముక్తి, పాపం !

చెన్నై/ తిరుచ్చి: కుటుంబ గొడవ కారణంగా దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. ఇదే సమయంలో భర్తతో గొడవ పడిన భార్య ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. తన భార్య తన 18 నెలల కుమార్తెను హత్య చేసి బావిలో విసిరేసిందని ఆమె భర్త కేసు పెట్టాడు. పోలీసులు భార్యను అరెస్టు చేసి జైలుకు పంపించారు. కేసు వాదనలు విన్న కింది కోర్టు భార్యకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. జైలు శిక్ష అనుభవిస్తున్న భార్య తరువాత హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో న్యాయమూర్తి తీర్పు ఇచ్చే సమయంలో ఆమె న్యాయవాది హాజరుకాలేదు. కేసు వాదనలు చివరిలో న్యాయవాది హాజరుకాకపోవడంతో ఆమె మళ్లీ జైలుకే పరిమితం అయ్యింది. అయితే ఇద్దరు న్యాయవాదులు మహిళ కేసును సుప్రీం కోర్టు వరకు తీసుకెళ్లారు. సుప్రీం కోర్టులో వాదనలు జరిగాయి. బాలిక చనిపోయిన తరువాత ఆమెను బావిలో వేశారని, బతికుండగానే ఆమెను బావిలో వెయ్యలేదని కోర్టు విచారణలో వెలుగు చూసింది. కూతురి హత్య కేసులో 11 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన మహిళ ఇప్పుడు 49 సంవత్సరాల వయసులో నిర్దోషిగా బయటకు విడుదల అయ్యింది.

దంపతుల మద్య గొడవలు

దంపతుల మద్య గొడవలు

తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలోని దత్తయ్యంగార్ పేట్ లో సెల్వరాజ్, శకుంతల (49) దంపతులు నివాసం ఉంటున్నారు. సెల్వరాజ్, శంకుతల దంపతులకు ఇద్దరు కుమార్తెలు, అప్పట్లో 18 నెలల కుమార్తె ఉండేది. 2002లో సెల్వరాజ్, శకుంతల దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. అప్పటికే సెల్వరాజ్, శంకుతల దంపతుల గొడవలు ఎక్కువ అయ్యాయి. తరువాత శంకుల భర్తతో గొడవ పడి ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది.

 కూతురి హత్య కేసులో తల్లి అరెస్టు

కూతురి హత్య కేసులో తల్లి అరెస్టు


శకుంతల పుట్టింటకి వెళ్లిపోయిన మరుసటి రోజు తన భార్య తన 18 నెలల కుమార్తెను హత్య చేసి బావిలో విసిరేసిందని ఆమె భర్త సెల్వరాజ్ కేసు పెట్టాడు. పోలీసులు సెల్వరాజ్ భార్య శకుంతలను అరెస్టు చేశారు. ప్రాథమిక విచారణలో శకుంతల ఆమె కూతురిని హత్య చేసిందని పోలీసులు ఆమెను జైలుకు పంపించారు. కేసు విచారణలో సమయంలో శకుంతల జైలులో ఉంది.

యావజ్జీవ శిక్ష

యావజ్జీవ శిక్ష

తాను తన కూతురిని హత్య చెయ్యలేదని, నేను పుట్టింటికి వెళ్లిన సమయంలో తన కూతురు బతికే ఉందని శకుంతల పోలీసులకు, కోర్టులో చెప్పింది. అయితే ప్రాథమిక కేసు విచారణ నివేదిక శకుంతలకు పూర్తిగా విరుద్దంగా ఉంది. కేసు వాదనలు విన్న కింది కోర్టు సాక్షులు ఇచ్చిన సమామాచారం మేరకు శకుంతలకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. జైలు శిక్ష అనుభవిస్తున్న శకుంతల కొన్ని సంవత్సరాల తరువాత మదురై హైకోర్టు బెంచ్ ను ఆశ్రయించింది.

చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చిన లాయర్

చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చిన లాయర్


మదురై హైకోర్టు బెంచ్ లో 2014 ఏప్రిల్ 22వ తేదీ కేసు తుది విచారణ జరుగుతున్న సమయంలో శకుంతల న్యాయవాది కోర్టు ముందు హాజరుకాలేదు. తరువాత హైకోర్టులో వాదనలు పూర్తి కాకపోవడంతో కింది కోర్టు విధించిన శిక్షను ఖరారు చేస్తూ మదురై హైకోర్టు బెంచ్ తీర్పు ఇచ్చింది. అప్పటి నుంచి శంకుతల కేసు వాదించడానికి ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో ఆమె జైలుకే పరిమితం అయ్యింది.

11 సంవత్సరాలు శిక్ష అనుభవించిన తల్లి

11 సంవత్సరాలు శిక్ష అనుభవించిన తల్లి


ఇప్పటికే శకుంతల కూతురి హత్య కేసులో 11 సంవత్సరాలు జైలు శిక్ష అనభవించింది. అయితే 2019లో థామస్ ఫ్రాంక్లిన్, మరో న్యాయవాది శకుంతల కేసును సుప్రీం కోర్టు వరకు తీసుకెళ్లారు. సుప్రీం కోర్టులో వాదనలు జరిగాయి. బాలిక చనిపోయిన తరువాత ఆమెను బావిలో వేశారని, బతికుండగానే ఆమెను బావిలో వెయ్యలేదని, పోస్టుమార్టు నివేదిక పూర్తిగా పరిశీలించకుండా కింది కోర్టు తీర్పు చెప్పలేదని సుప్రీం కోర్టులో శకుంతుల న్యాయవాదులు వాదించారు.

 నిర్దోషిగా విడుదలైన తల్లి

నిర్దోషిగా విడుదలైన తల్లి

సుప్రీం కోర్టు విచారణలో శకుంతల ఆమె కూతురిని హత్య చెయ్యలేదని వెలుగు చూసింది. శుకుంతలను జైలు నుంచి విడుదల చెయ్యాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు ఆమెను కేసు నుంచి నిర్దోషిగా ప్రకటించింది. కూతురి హత్య కేసులో 11 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన శకుంతల ఇప్పుడు 49 సంవత్సరాల వయసులో నిర్దోషిగా బయటకు వచ్చింది. చెయ్యని నేరానికి నేను ఇన్ని సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించానని, ఇప్పుడు తనకు ప్రభుత్వం న్యాయం చేసి ఆదుకోవాలని శకుంతల మనవి చేస్తోంది.తన జీవితం నాశనం కావడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక మంది కారణం అయ్యారని, 22 సంవత్సరాలు ఉన్న సమయంలో తాను అనవసరంగా జైలుకు వెళ్లానని, ఇప్పుడు తనకు 49 సంవత్సరాలు అయ్యిందని, నా అనుకున్న వాళ్లు అందరూ దూరం అయ్యారని, ఇప్పుడు నన్ను ప్రభుత్వమే ఆదుకోవాలలని శకుంతల మనవి చేస్తోంది. ఇంతకాలానికి తాను తప్పు చెయ్యలేదని కోర్టులో వాదించి నన్ను నిర్దోషిగా విడుదల చేయించిన ఇద్దరు న్యాయవాదులకు, తనకు సహాయం చేసిన మరో వ్యక్తికి తాను జీవితాంతం రుణపడి ఉంటానని శకుంతల అన్నారు. కన్న కూతురి హత్య కేసులో జైలుకు వెళ్లిన శకుంతల ఇప్పుడు నిర్దోషిగా బయటకు తీసుకువచ్చిన లాయర్లను ఆమె కుటుంబ సభ్యులు పొగడ్తలతో ముంచేస్తున్నారని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+