వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దారుణం: వాట్సాప్ ప్రచారం, ఈ 9 రాష్ట్రాల్లోనే 27 మందిని చంపేశారు

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సోషల్ మీడియా వేదిక అయిన వాట్సాప్‌లో పిల్లలను ఎత్తుకెళ్తున్నారనే అసత్య వార్తల కారణంగా దేశవ్యాప్తంగా ఒక్క ఏడాదిలో ఎంతోమందిని చంపేశారు. నిజానిజాలు తెలుసుకోకుండా ఆయా ప్రాంతాల్లోని ప్రజలు కొత్తగా వచ్చిన పలువురిని హత్య చేశారు. ఒక్క ఏడాదిలోనే 9 రాష్ట్రాల్లోని 15 కేసులలో 27 హత్యలు జరిగాయి.

ఈ కారణంగా ఒక్క ఏడాదిలో తొమ్మిది రాష్ట్రాల్లో 27 హత్యలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రాల వారీగా చూస్తే మహారాష్ట్రలోని ఔరంగబాద్‌లో 8 జూన్ 2018న ఇద్దరని, 11 జూన్ 2018న గోండా గోరేగావ్ టౌన్‌లో ఒకరిని, 15 జూన్ 2018న ఔరంగాబాద్‌లోని చవానీలో ఒకరిని, 1 జూలై 2018న దుహ్లేలోని రెయిన్‌పాడాలో ఐదుగుర్ని చంపారు.

Murderous mob: 9 states, 27 killings, one year: And a pattern to the lynchings

23 మే 2018న తెలంగాణలోని నల్గొండ జిల్లా జియాపల్లిలో ఒకరిని, కర్ణాటకలోని బెంగళూరు కాటన్‌పేటలో 23 మే 2018న ఒకరిని, 9 మే 2018న తమిళనాడులోని తిరువణ్ణమలై.. అతిమూర్‌లో ఒకరిని, 22 జూన్ 2018 చత్తీస్‌గఢ్‌లోని సుర్జువాలోని మేండ్రకలలో ఒకరిని, 8 జూన్ 2018న అసోంలోని పంజూరి కచారీ, కాబ్రీ ఆంగ్లోంగ్‌లలో ఇద్దరిని చంపేశారు.

18 మే 2017లో జార్ఖండ్‌లోని ఈస్ట్ సింగ్‌భూమ్.. నాగాఢిలో ముగ్గురిని, 19 మే 2017న సెరాలికేలా ఖర్షవాణ్‌లోని షోభాపూర్‌లో నలుగురిని, పశ్చిమ బెంగాల్‌లోని మాల్దాలో 13 జూన్ 2018న ఒకరిని, 23 జూన్ 2018న ఈస్ట్ మిడ్నాపూర్‌లో ఒకరిని, 28 జూన్ 2018న వెస్ట్ త్రిపురలోని మోహన్‌పూర్‌లో ఒకరిని, సౌత్ త్రిపురలోని కాలాఛారాలో ఒకరిని, సెపాహిజాలాలో ఒకరిని హత్య చేశారు.

English summary
Being an outsider, moving after sunset, taking an unfamiliar road, stopping to ask for directions, even offering a chocolate to a child on the way. This is what led to the killing of 27 people in 15 cases of lynchings by frenzied mobs blinded by viral rumours of child-kidnappers on the prowl across nine states — from Assam to Tamil Nadu — in the last one year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X