యూపీలో కలకలం: బీఎస్పీ నేత కాల్చివేత, 'యోగి' సీఎం అయిన కొద్ది గంటలకే!

Subscribe to Oneindia Telugu

లక్నో: ఉత్తరప్రదేశ్ కొత్త సీఎంగా యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు చేపట్టిన కొద్ది గంటల్లోనే రాష్ట్రంలో కలకలం రేగింది. బహుజన్ సమాజ్ వాదీ పార్టీ(బీఎస్పీ) నేత మహమ్మద్ షమీని కొంతమంది గుర్తు తెలియని దుండగులు తుపాకీతో కాల్చి చంపారు.

అలహాబాద్ లో చోటు చేసుకున్న ఈ ఘటనలో దుండగులు బైక్ పై వచ్చి షమీపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. స్థానిక మీడియా కథనం ప్రకారం.. ఆదివారం రాత్రి 9.30గం. సమయంలో షమీ అలహాబాద్ లోని ఓ పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్నాడు. ఇంతలో బైక్స్ పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై బుల్లెట్ల వర్షం కురిపించారు.

Muslim BSP Leader Shot dead in Allahabad

మొత్తం ఐదు బుల్లెట్లు షమీ శరీరంలో దిగడంతో ఆయన అక్కడిక్కడే మృతి చెందాడు. షమీ తొలుత సమాజ్ వాదీ పార్టీలో ఉన్నప్పటికీ.. ఇటీవల ఎన్నికలకు ముందు ఆయన బీఎస్పీలో చేరారు. షమీ కాల్చివేత సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని ఘటన జరిగిన తీరును పరిశీలించారు. నిందితులను పట్టుకోవడం కోసం స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Just a few hours later of Yogi Adityanath taking the oath for the Uttar Pradesh’s Chief Minister, a Bahujan Samajwadi Party (BSP) politician Mohammad Shami has been shot dead in Allahabad.
Please Wait while comments are loading...