హిందూ దేశంగా మారుస్తారా?: ఆరెస్సెస్ ఇంద్రేష్‌జీ వద్దకెళ్లి ముస్లీంల ప్రశ్నలు

న్యూఢిల్లీ: భారత దేశాన్ని హిందూ దేశంగా మారుస్తారా, తాము దేశభక్తిని ఎలా ప్రదర్శించాలని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆరెస్సెస్) నేత ఇంద్రేష్‌ను సున్నీ ఉలేమా కౌన్సిల్ ప్రశ్నించింది. మీ దృష్టిలో భారత్‌ హిందూ దేశమా? భారత్‌ను హిందూదేశంగా మార్చే ప్రణాళికలేమైనా మీ దగ్గరున్నాయా? అని వారు ప్రశ్నించారు. ఆయనకు వారు మొత్తం ఆరు ప్రశ్నలు సంధించి, జవాబు చెప్పాలన్నారు.

కౌన్సిల్‌ ప్రధాన కార్యదర్శి హాజీ మహమ్మద్‌ సలీస్‌ నేతృత్వంలో కొందరు మతపెద్దలు సోమవారం రాత్రి ఆరెస్సెస్ మైనారిటీ వ్యవహారాల ఇంఛార్జ్ ఇంద్రేశ్‌జీని కలిశారు. ఆ భేటీ వివరాలను సలీస్‌ మంగళవారం కాన్పూర్‌లో విలేకరులకు తెలిపారు. హిందూ దేశం, మతమార్పిడులు వంటి అనేక అంశాలు ముస్లింలలో ఆందోళన కలిగిస్తున్నాయని, మా వర్గంలో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయన్నారు.

అందుకే వీటిపై స్పష్టత కోసం ఇంద్రేశ్‌ను కలిశామని, ఆరు ప్రశ్నలు అడిగామన్నారు. వాటికి ఆయన సమాధానం చెప్పలేదన్నారు. హిందూ దేశంపై ఆర్భాటపు ప్రచారమే తప్ప ఆరెస్సెస్ వద్ద ఎలాంటి ప్రణాళికలూ లేవని, అసలు హిందూ రాష్ట్రం అంటే ఏమిటని ప్రశ్నించారు. హిందూమతం ఆధారంగా ఆరెస్సెస్ కొత్త సిద్ధాంతాన్ని రూపొందిస్తే హిందుత్వ అనేది మత సంస్కృతే కాదని, అప్పుడు ఎవరైనా మతం మారిపోవచ్చన్నారు.

Muslim clerics pose six questions to RSS

రాజ్యాంగం మత స్వేచ్ఛను కల్పించిందన్నారు. అలాంటప్పుడు మత మార్పిళ్లపై ఎందుకు భయమెందుకన్నారు. తమకు కూడా అలాంటి భయం లేదన్నారు. ఏ ముస్లింకైనా ఇస్లాం నచ్చకపోతే వారు నిరభ్యంతరంగా బయటికి వెళ్లి పోవచ్చునని, 1947లో దేశాన్ని విభజించారన్నారు. తమ పూర్వీకులు జిన్నా సిద్ధాంతంతో, పాకిస్థాన్‌తో విభేదించారన,ి భారత్‌ తమ దేశమని, మహాత్ముడే తమ నాయకుడని నిర్ణయించుకున్నారన్నారు.

ఆరెస్సెస్ ముస్లింల నుంచి ఏం ఆశిస్తోంది? తాము వందేమాతరం ఆలపించాలా? వారు రూపం ఇచ్చిన భారతమాతకు తలవంచి నమస్కరించాలా? మేం అందుకు అంగీకరించమన్నారు. అది ఇస్లాంకు విరుద్ధమన్నారు. ఆరెస్సెస్ నేతతో గంటన్నరపాటు సమావేశమయ్యామన్నారు. అసదుద్దీన్ ఓవైసీ పైన తమను ఆయన ప్రశ్నించారన్నారు. కాగా, సాక్షి మహరాజ్‌, సాధ్వీ నిరంజన్‌ జ్యోతి ఎలాగో.. అసదుద్దీన్ ఒవైసీ కూడా అంతే. ఆయన కేవలం ఎంపీ మాత్రమే అని బదులిచ్చాం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+