భార్యను నాలుగుసార్లు పెళ్ళి చేసుకొన్నాడు, ఎందుకంటే?

Posted By:
Subscribe to Oneindia Telugu

పనాజీ: ప్రేమించుకొన్నారు. పెళ్ళిచేసుకొన్నారు.అయితే ఆ ప్రేమికుల పెళ్ళికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో విడిపోదామని నిర్ణయించుకొన్నారు. అయితే ఒకరిని విడిచి మరోకరు ఉండడం ఇష్టం లేక పెద్దలను ఎదరించి పెళ్ళిచేసుకోవాలని కూడ అనుకోలేదు.అయితే పెద్దలను ఎదిరించాలని కూడ అనుకోలేదు. నాలుగు సార్లు ఈ జంట వివాహం చేసుకొంది.

అంకిత అగర్వాల్ ఓ హిందూ అమ్మాయి, రెహమాన్ అనే ముస్లిం యువకుడు ప్రేమించుకొన్నారు. అయితే రహమాన్ కు అంకితను ఇచ్చి వివాహం చేయాలంటే ఆమె తల్లిదండ్రులు అంగీకరించలేదు. రహమాన్ ఎక్కువకాలం తమ కూతురితో కాపురం చేయలేరనే అనుమానాన్ని వ్యక్తం చేశారు అంకిత తల్లిదండ్రులు.

Muslim Guy Married His Hindu Wife 4 Times

అంతేకాదు తమ కూతురిని ముస్లిం మతంలోకి మారుస్తారనే ఆందోళన చెందారు. తాను ప్రేమించిన అమ్మాయి తల్లిదండ్రుల ఆవేదనను అర్ధం చేసుకొన్న రహమాన్ మరో ఉపాయాన్ని ఆలోచించాడు.

తాను మరో స్త్రీని పెళ్ళిచేసుకోకుండా ఉంటానని అంకిత తల్లిదండ్రులను నమ్మించేందుకుగాను అంకితనే నాలుగుసార్లు పెళ్ళిచేసుకొని తన ప్రేమను నిరూపించుకొన్నాడు.

వారిద్దరూ మొదటిసారిగా గోవాలోని మహాలక్ష్మీ ఆలయంలో రామమందిరంలో దండలు మార్చుకొని వివాహం చేసుకొన్నారు. అనంతరం నాలుగుసార్లు పెళ్ళిచేసుకోవడాన్ని అనుమతించని ప్రత్యేక వివాహ చట్టం కింద రెండోసారి పెళ్ళి చేసుకొన్నారు.

ఆ తర్వాత హిందూ సంప్రదాయం ప్రకారం మూడో సారి, బంధుమిత్రులతో కలిసి గోవా వెళ్ళి అక్కడ నాలుగోసారి ముస్లిం మత సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకొన్నాడు.

అయితే ఎవరి మత సంప్రదాయాలకు అనుగుణంగా వారు తమ ప్రార్థనామందిరాలకు వెళ్ళి పూజలు చేసుకొంటున్నారు. మతాలు వేరైనా కలిసిమెలిసి జీవించవచ్చని ఈ జంట నిరూపించింది. నాన్ వెజ్ కు దూరంగా ఉండే అంకిత ఇప్పుడు మాంసం కూడ తినడం లేదు. మతం కూడ మారలేదు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Ankita Agarwal and Faiz Rehman, a beautiful Hindu-Muslim couple who got married not just once, not two, but four different times! And not just that, they got married in four different ways.
Please Wait while comments are loading...