ముస్లిం ఆధ్యాత్మిక గురువు సూఫీబాబా దారుణహత్య; మహారాష్ట్రలోని నాసిక్‌లో ఘటన
మహారాష్ట్ర: మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోని యోలా పట్టణంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ముస్లిం ఆధ్యాత్మిక గురువు దారుణ హత్యకు గురయ్యారు. ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన సూఫీబాబా ఖ్వాజా సయ్యద్ చిస్తీ(35)ను గుర్తు తెలియని ఆగంతకులు దారుణంగా హతమార్చారు. నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను మంగళవారం హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
స్థానికంగా "సూఫీ బాబా"గా ప్రసిద్ధి చెందిన ఖ్వాజా సయ్యద్ చిస్తీ ముంబైకి 200 కి.మీ దూరంలో ఉన్న ప్రదేశంలో హత్యకు గురయ్యాడు. యోలా పట్టణంలోని ఎంఐడీసీ ప్రాంతంలోని బహిరంగ ప్లాట్‌లో ఈ హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు. తలపై కాల్పులు జరపడంతో అతను సంఘటనా స్థలంలోనే మరణించాడని పోలీసులు తెలిపారు. ముస్లిం మత గురువు ను హతమార్చిన తర్వాత హంతకులు సూఫీబాబా కు చెందిన ఎస్వూవీ ఒక దానిలో తప్పించుకున్నారు.

సయ్యద్ చిస్తీ నాసిక్‌లోని యోలా పట్టణంలో కొన్నేళ్లుగా నివసిస్తున్నాడని, ఈ హత్యలో మతపరమైన ఉద్దేశాలు లేవని పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనలో అతని డ్రైవర్ ను ప్రధాన నిందితుడుగా పోలీసులు చెబుతున్నారు. సయ్యద్ చిస్తీ డ్రైవర్ పేరును సాక్షులు పేర్కొన్నారని పోలీసు అధికారి సచిన్ పాటిల్ తెలిపారు. అనుమానితుడిని ప్రశ్నిస్తున్నారు. అయితే ముస్లిం ఆధ్యాత్మిక గురువు హత్యకు సంబంధించి కారణం ఇంకా తెలియరాలేదు.
సయ్యద్ చిస్తీ ఆఫ్ఘనిస్తాన్ పౌరుడిగా ఉండడంవల్ల దేశంలో భూమిని కొనుగోలు చేయలేని కారణంగా, స్థానిక ప్రజల పేరుపై భూమిని కొనుగోలు చేశారని, ఈ క్రమంలోనే డ్రైవర్ పైన కూడా భూమి కొనుగోలు జరిగిందని, ఇక ఆ భూమి కోసమే డ్రైవర్ హత్య చేసి ఉండవచ్చని పోలీసులు తెలిపారు. డ్రైవర్ ను ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications