మోడీ, యోగి చిత్రాలు గీసినందుకు ముస్లీం యువతి ఇంట్లో నుంచి గెంటివేత
ప్రధాని నరేంద్ర మోడీ, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చిత్రాలు గీసినందుకు ఓ ముస్లిం మహిళను అత్తింటివారు ఇంట్లో నుంచి గెంటేశారు.
లక్నో: ప్రధాని నరేంద్ర మోడీ, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చిత్రాలు గీసినందుకు ఓ ముస్లిం మహిళను అత్తింటివారు ఇంట్లో నుంచి గెంటేశారు.
ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బల్లియా ప్రాంతంలో జరిగింది. బల్లియా ప్రాంతానికి చెందిన నగ్మా పర్వీన్‌కి పెయింటింగ్ అంటే ఎంతో ఆసక్తి.

ఆమె సరదాగా ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాత్ పెయింటింగ్‌లు వేసింది. అది చూసిన అత్తింటివారు ఆమెను చావబాది ఇంట్లో నుంచి గెంటేశారు.
విషయం తెలిసి నగ్మా తండ్రి పోలీసులను ఆశ్రయించారు.
మతిస్థిమితం కోల్పోయి ఇలా పెయింటింగ్‌లు వేస్తోందని ఆరోపిస్తూ తన కుమార్తెను కొట్టి తరిమేశారని పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications