ఆదిత్యనాథ్ కు మద్దతుగా గోరఖ్ పూర్ లో ముస్లింల ర్యాలీ

Posted By:
Subscribe to Oneindia Telugu

గోరఖ్ పూర్:ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాద్యతలు చేపట్టిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు మద్దతుగా ఆదివారం నాడు ర్యాలీ నిర్వహించారు.విపక్షాలు యోగి ఆదిత్యనాథ్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ముస్లింలు ఆరోపించారు.

యోగి ఆదిత్యనాథ్ హిందువులు, ముస్లింలను ఓకేరంగా చూస్తారని వారు అభిప్రాయపడ్డారు. ఉద్దేశ్యపూర్వకంగానే కొన్ని రాజకీయపార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ముస్లింలు ఆరోపించారు.

muslims rally in support of yogi adityanath in ghorakh pur

యోగి చిత్రపటాలు, ప్లకార్డులను చేతబట్టుకొని ఆయనకు మద్దతుగా గోరఖ్ పూర్ లో ర్యాలీ నిర్వహించారు. హిందు మతానికి ఆదిత్యనాథ్ ఎంత గౌరవం ఇస్తారో ముస్లిం సమాజానికి కూడ అంతే గౌరవమిస్తారని స్థానిక ముస్లింలు చెప్పారు.

14 ఏళ్ళుగా ఆయనను చూస్తున్నట్టుగా వారు చెప్పారు.యోగిని ముస్లిం వ్యతిరేకిగా చూడడం సరికాదన్నారు. సమాజాన్ని తప్పుదోవ పట్టించేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ముస్లింలు ఆరోపించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడ ఆయన ముస్లిం సమాజాన్ని గౌరవిస్తారని ఇర్ఫాన్ అనే యువకుడు చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
muslims rally in support of yogi adityanath in ghorakh pur on sunday. opposition parties false allegations on yogi said local muslims.
Please Wait while comments are loading...