ఎంవీఏ కూటమికి బీటలు! ఉద్ధవ్ థాక్రే పార్టీ సంచలన నిర్ణయం

దేశ వ్యాప్తంగా ఇండియా కూటమిలోని పార్టీలో ఎవరిదారి వారు చూసుకుంటుండగా.. తాజాగా, మహారాష్ట్రలోనూ అదే పరిస్థితి నెలకొంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమిలోని కాంగ్రెస్, శరద్ పవార్ ఎన్సీపీ, ఉద్ధవ్ థాక్రే శివసేన పార్టీలు కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఎన్నికల్లో ఎంవీఏకు ఘోర పరాజయం ఎదురైంది.

ఈ నేపథ్యంలో ఎంవీఏలో లుకలుకలు మొదలయ్యాయి. ఒక పార్టీపై మరో పార్టీ ఆరోపణలు, విమర్శలు చేసుకోవడం మొదలుపెట్టాయి. ఈ క్రమంలో మహారాష్ట్రలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ఎంవీఏ కూటమిలోని ఉద్ధవ్ థాక్రే శివసేన పార్టీ ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమైంది. దీంతో ఎంవీఏ కూటమికి ఉద్ధవ్ థాక్రే గుడ్‌బై చెప్పినట్లేనని తెలుస్తోంది.

MVA alliance in tatters Uddhav Thackeray s Shiv Sena party ready to fight alone in municipal polls

ముంబై, నాగ్‌పూర్, థానేలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో శివసేన(యూబీటీ) ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకుందని ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ శనివారం వెల్లడించారు. దీంతో మహారాష్ట్రలో ఎంవీఏ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. కూటమి కారణంగా పార్టీ కార్యకర్తలకు అవకాశాలు ఉండటం లేదని, సంస్థాగతంగా కూడా పరిస్థితులు బాగోలేదన్నారు సంజయ్ రౌత్.

ఈ క్రమంలోనే ఒంటరిగా పోటీ చేయాలని భావిస్తున్నట్లు సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. ముంబై, థానే, నాగ్‌పూర్, ఇతర మున్సిపల్ కార్పొరేషన్లు, జిల్లా పరిషత్‌లు, పంచాయతీ ఎన్నికల్లోనూ ఒంటరిగానే పోటీ చేయబోతున్నట్లు సంజయ్ రౌత్ తెలిపారు. ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లాలని ఉద్ధవ్ థాక్రే సంకేతాలిచ్చారని సంజయ్ రౌత్ వెల్లడించారు.

ఈ సందర్భంగా సంజయ్ రౌత్ ఎంవీఏ కూటమిలోని లోపాలను ఎత్తి చూపారు. 2024 సార్వత్రిక ఎన్నికల కోసమే ఇండియా కూటమి ఏర్పడిందని.. ఓటమి తర్వాత కనీసం సమీక్ష చేసుకునేందుకు ఒక్క సమావేశం కూడా ఏర్పాటు చేయలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో కూటమిలో నిరాశ, నిస్పృహలు ఏర్పడినట్లు చెప్పుకొచ్చారు.

మరోవైపు, ఒంటరిగా పోటీ చేసే విషయంలో ఉద్ధవ్ థాక్రే నుంచి ప్రకటన వెలువడే వరకు వేచిచూస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మరోవైపు, ఎన్సీపీ శరద్ పవార్ పార్టీ కూడా ఎంవీఏ కూటమికి షాకిచ్చే నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో జిల్లాల విభాగాలకే నిర్ణయాన్ని వదిలేసింది.

కాగా, ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని మహాయుతి కూటమి మొత్తం 288 సీట్లలో 230 స్థానాలను కైవసం చేసుకుని ఘన విజయం నమోదు చేసింది. ఎంవీఏ మాత్రం 46 సీట్లతోనే సరిపెట్టుకుంది. కాంగ్రెస్ 20, శివసేన(యూబీటీ) 20, ఎన్సీపీ శరద్ పవార్ 10 స్థానాలు దక్కించుకున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+