లేచేసరికి నగ్నంగా ఆమె.. పక్కనే బాస్: బలవంతంగా హోటల్స్ లోను, దేశం విడిచినా!

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఒకే సంస్థలో పనిచేస్తున్న సమయంలో తనతో చనువు పెంచుకున్న సహోద్యోగి.. ఓ మహిళ జీవితాన్ని నాశనం చేశాడు. దేశం విడిచి వేరే చోటుకు వెళ్లినా.. అక్కడ కూడా ఎదురై ఆమెను లైంగికంగా వేధిస్తున్నాడు. దీనిపై ఆ ఎన్నారై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చాలా విషయాలు వెలుగుచూశాయి.

బాధితురాలి కథనం ప్రకారం.. గురుగ్రామ్‌లో పనిచేస్తున్న సమయంలో హైదరాబాద్‌కు చెందిన సహోద్యోగితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఒకే డిపార్ట్‌మెంటులో పనిచేస్తుండటంతో ఆమె అతనితో తరుచుగా సంప్రదింపులు చేయాల్సి వచ్చేది. తరుచూ టెలికాన్ఫరెన్స్‌లో అతనితో మాట్లాడాల్సి రావడంతో
దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకున్నాడు.

My boss followed me to Australia to rape me, says NRI woman

పని నిమిత్తం తరుచూ గురుగ్రామ్ వచ్చే అతను.. ప్రాజెక్టుల్లో ఆమెను కూడా కలుపుకుపోయేవాడు. ఆమెతో స్నేహం చేయడం కోసం ప్రయత్నించేవాడు. అదే సమయంలో తన భార్య తనను వదిలిపెట్టిన విషయాన్ని, ఆమె ఎంత దుర్మార్గురాలో అన్నది ఆమెతో చెప్పాడు. భార్య లేకపోయినా కూతురిని తానే పెంచుతున్నట్లు చెప్పేవాడు. ఎప్పుడూ ఏదో ఒక సమస్య గురించి చెప్పడానికి తరుచూ ఆమెకు ఫోన్ చేస్తుండేవాడు.

అలా 2013మార్చిలో ఒకరోజు ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న విషయాన్ని తెలుసుకుని.. అతను నేరుగా అక్కడికెళ్లాడు. ఇంటికి వచ్చిన అతనికి ఆమె కూల్ డ్రింక్ ఇవ్వగా.. ఆ తర్వాత ఆమె కూడా తాగింది. అయితే చాలాసేపటి తర్వాత లేచి చూస్తే.. బెడ్రూమ్‌లో నగ్నంగా ఉండటం గమనించింది. ఆమె పక్కనే చైర్ లో కూర్చున్న అతను.. జరిగింది మరిచిపోవాలని బెదిరించాడు.

అప్పటినుంచి ఆమె నగ్న ఫోటోలు, వీడియోలతో బయటపెట్టి తనను సంతోషపెట్టాలని వేధించేవాడు. అలా అతని వెంట ఆమెను బలవంతంగా పలు పెద్ద పెద్ద హోటల్స్‌కు తీసుకెళ్లి వేధించాడు. వేధింపుల నుంచి విముక్తి లభించాలంటే భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేశాడని, అలా రూ.20లక్షలు అతని చేతిలో పెట్టినా తనకు వేధింపులు తప్పలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు.

డబ్బులు తీసుకుని కూడా తనపై దాడి చేశాడని, ఈ వేధింపులకు తాళలేక భర్త, పిల్లలతో ఆస్ట్రేలియా వెళ్లినా.. అక్కడికి వచ్చి తనను హింసిస్తున్నాడని తన గోడు వెల్లబోసుకుంది. తన భర్తను ఈమెయిల్స్ ద్వారా బెదిరిస్తూ విడిచిపెట్టేది లేదని ఆమె వెల్లడించింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
If the alleged stalking incident involving a Haryana BJP MLA's son makes your blood boil, here is a case that could scare you out of your wits. A 38-year-old woman has filed a complaint of stalking,
Please Wait while comments are loading...