వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేప్: మమత ప్రభుత్వాన్ని కుదిపేస్తున్నమృతి, బెదిరింపు

By Srinivas
|
Google Oneindia TeluguNews

My daughter didn't commit suicide, says victim's father
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో సామూహిక అత్యాచార బాధితురాలి మృతి అంశం సర్కారును కుదిపేస్తోంది. అంత్యక్రియల విషయంలో పోలీసులు అనుసరించిన వైఖరిపై నిరసనలు వ్యక్తమవుతుండటంతో తృణమూల్ కాంగ్రెసు పార్టీ సర్కారు ఇరకాటంలో పడింది. 16 ఏళ్ల యువతిపై గత అక్టోబరు 26న ఉత్తర 24 పరగణాల జిల్లాలో ఆరుగురు యువకులు అత్యాచారం చేశారు. బాధిత కుటుంబం బీహార్ నుండి అంతకుముందు కొద్ది రోజుల ముందు వలస వచ్చింది.

బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులను అరెస్టు చేశారు. బాధితురాలు డిసెంబర్ 23న ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యకు యత్నించింది. 60 శాతం కాలిన ఆమెను స్థానిక ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది.

శవాన్ని తీసుకొని రాష్ట్రం విడిచి వెళ్లిపోవాలని పోలీసులు, స్థానిక నేతలు బెదిరించారని మృతురాలి తండ్రి బుధవారం గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు లెఫ్ట్ పార్టీలు పిలుపునిచ్చాయి.

తమ కుమార్తెపై సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆమె ప్రాణాలను బలి తీసుకున్న నిందితులకు మరణశిక్ష విధించాలని తల్లిదండ్రులు గవర్నర్‌ను కోరారు. మరోవైపు తన కూతురు ఆత్మహత్యకు పాల్పడలేదని, ఎవరో ఆమెకు నిప్పు అంటించి చంపే ప్రయత్నాలు చేశారని తండ్రి ఆరోపిస్తున్నారు.

English summary
Gang-raped twice and dumped in a government hospital for nine days with fatal burns, the 16-year-old victim had no peace even after death.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X