నా జీవితం రైల్వేట్రాక్‌లపై మొదలైంది: 85వేలకోట్ల రైల్వే ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీ!!
భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు 10 కొత్త వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ల ప్రారంభోత్సవంతో పాటు, పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. నేడు మొత్తం 85 వేల కోట్ల రైల్వే ప్రాజెక్టులను మోడీ ప్రారంభించారు. రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి పలు శంకుస్థాపన కార్యక్రమాలను నిర్వహించారు.
అహ్మదాబాద్లోని డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించిన తర్వాత గుజరాత్ లోని అహ్మదాబాద్ సబర్మతి ప్రాంతం నుండి నరేంద్ర మోడీ ఈ ప్రాజెక్టులను ప్రారంభించారు. వర్చువల్ గా పలు రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించిన మోడీ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. రైల్వేలు కొత్త చరిత్ర సృష్టించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ ల వల్ల దేశంలో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.

తమకు ఎలాంటి సదుపాయాలు కావాలో ఎలాంటి రైళ్ళు కావాలో దేశ యువత నిర్ణయిస్తుందని చెప్పారు. రైల్వేల ప్రగతి వేగాన్ని తగ్గనివ్వబోమని ప్రధాని స్పష్టం చేశారు. రైల్వేలను నిరంతరం ఆధునీకరించటానికి, విస్తరించటానికి, నూరు శాతం విద్యుదీకరణకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. రైల్వేల ఆధునీకరణ వల్ల మేడ్ ఇన్ ఇండియా కు సానుకూల వాతావరణం ఏర్పాడుతోందని వివరించారు. ప్రజల అభీష్టం మేరకు వందే భారత్ రూట్లను విస్తరిస్తున్నట్లు చెప్పారు.
లోక్సభ ఎన్నికలకు ముందు భారీగా రైల్వే అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ప్రధాని మోడీ మాట్లాడుతూ తమ ప్రభుత్వం దేశాన్ని నిర్మించాలని లక్ష్యంతో ఉందని, అందులో భాగంగానే అభివృద్ధి పనులు చేపడుతుందని పేర్కొన్నారు. కొంతమంది గెలవడం కోసమే అభివృద్ధి పనులు చేస్తున్నట్టు చెబుతున్నారని, అది కరెక్ట్ కాదన్నారు.
గత పదేళ్లలో తమ ప్రభుత్వం రైల్వేల అభివృద్ధి కోసం గత ప్రభుత్వాలు చేసిన దానికంటే 6 రెట్లు ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేసిందని ప్రధాని మోడీ తెలిపారు. 2022లో కేవలం రెండు నెలల వ్యవధిలో మేము 11 లక్షల కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించామని, అనేక శంకుస్థాపన కార్యక్రమాలు చేశామని మోడీ తెలిపారు.
ఈ సందర్భంగా మోడీ తన జీవితం రైల్వే ట్రాక్ ల పైన ప్రారంభమైందని తన గతాన్ని గుర్తు చేసుకున్నారు. మన రైల్వేలు ఎంత అద్వానంగా ఉండేవో నాకు తెలుసని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. అంతేకాదు రైల్వే బడ్జెట్ ను ప్రత్యేకంగా ప్రవేశపెట్టడం ఆపివేసి, దానిని కూడా కేంద్ర బడ్జెట్ లో చేర్చామని మోడీ వెల్లడించారు. ఇలా చేయడం వల్ల ప్రభుత్వ సొమ్మును రైల్వేల అభివృద్ధికి వినియోగించవచ్చునని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
-
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి












Click it and Unblock the Notifications