మా అమ్మా ఇంద్రాణి లాంటిదే: ఓ విద్యార్థి ఆవేదన

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అందర్నీ ఆలోచనలో పడేసే ఓ సంఘటన చోటుచేసుకుంది. ఢిల్లీలోని పాఠశాలల్లో హోం వర్కు చేయని విద్యార్థులు ఎందుకు చేయలేకపోయారో కారణాలు వివరిస్తూ టీచర్లకు లేఖలు రాస్తుంటారు. ఇది సాధారణమే.. కానీ ఓ పాఠశాల విద్యార్థి రాసిన లేఖ టీచర్లను నిర్ఘాంత పోయేలా చేసింది.

తన తల్లి కూడా ఇంద్రాణీ ముఖర్జియా లాంటిదేనని, తన తల్లికి చాలా మందితో అక్రమ సంబంధాలు ఉన్నాయని, తాను కూడా అక్రమ సంతానన్నేనని ఆ బాలుడు లేఖలో పేర్కొన్నాడు.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనాబొరా హత్య కేసులో ఇంద్రాణి ముఖర్జీ అరెస్టు అయ్యారు. ఆమె నలుగురిని వివాహం చేసుకుందని, కుమార్తెను హత్య చేసిందని.. ఇలాంటి వార్తలు గత వారం రోజులుగా వార్తా పత్రికల్లో వస్తున్న సంగతి తెలిసిందే.

My mother is like Indrani Mukerjea, likes to have sex with many men, wrote a class 7 student

కాగా, ఆ బాలుడు రాసిన ఉత్తరం చూసిన ఉపాధ్యాయులు ఈ విషయాన్ని పాఠశాల ప్రిన్సిపల్‌కి తెలియజేశారు. దీంతో ఆయన ఆ చిన్నారి తల్లిదండ్రులను పాఠశాలకు పిలిపించి మాట్లాడారు.

అనంతరం బాలుడికి పాఠశాల యాజమాన్యం కౌన్సిలింగ్ ఇస్తోంది. పసి హృదయాలపై ఇంద్రాణీ ముఖర్జియా వంటి వార్తలు నాటుకుంటే ప్రమాదమని వారు సూచిస్తున్నారు. వారిలోని ఆలోచనలను మార్చాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు. .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+