నా రాజకీయ జీవితం ముగియలేదు: బ్లాగ్‌లో అద్వానీ

55 ఏళ్ల క్రితం మొదలైన తన రాజకీయ ప్రస్థానం ఇంకా ముగియలేదని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో తన రాజకీయ ప్రస్థానం ముగియలేదంటూ వ్యాఖ్యానించడం ద్వారా తాను ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోలేదన్న స్పష్టమైన సందేశాన్నిచ్చారు.
దాదాపు నెలన్నరగా బ్లాగులో స్పందించని అద్వానీ తాజాగా ఆరెస్సెస్‌తో తన అనుబంధాన్ని వివరించారు. ఆరెస్సెస్‌తో అనుబంధం తన జీవితానికి ఎలా అర్థాన్నిచ్చిందంటే.. అంటూ తన రాజకీయ ప్రస్థానాన్ని గుర్తుచేసుకున్నారు.
కరాచీలో ఆరెస్సెస్‌లో చేరేటప్పటికి తన వయసు పద్నాలుగున్నరేళ్లని ఇంటిని, కుటుంబాన్ని వదిలి ఆరెస్సెస్‌లో ప్రచారక్‌గా చేరడం, ప్రచారక్‌గా తొలుత కరాచీలో, దేశ విభజన తర్వాత రాజస్థాన్‌లో పని చేయడం తన జీవితానికో అర్థాన్నిచ్చిందని పేర్కొన్నారు.
ఆ తర్వాత 55 సంవత్సరాల క్రితం రాజకీయ ప్రస్థానం ప్రారంభించడం ఆ అర్థాన్ని మరింత మెరుగు పడిందని, ఇదొక ప్రయాణమని, ఆ ప్రయాణం ఇంకా ముగియలేదని రాశారు.












Click it and Unblock the Notifications