Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అంబానీ, అదానీల సమయం కన్నా నా సమయమే విలువైంది: రాందేవ్ బాబా సంచలనం

ప్రముఖ యోగ గురువు రాందేవ్ బాబా తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. వేల కోట్లకు అధిపతులు అయిన, ప్రముఖ వ్యాపార దిగ్గజాలు ముఖేష్ అంబానీ, అదాని, టాటా, బిర్లాల పైన ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వ్యాపారవేత్తలు వారి సమయాన్ని డబ్బుతో లెక్కిస్తారని పేర్కొన్న ఆయన, వారందరి సమయం కంటే తన సమయమే విలువైందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గోవాలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన రాందేవ్ బాబా ఈ వ్యాఖ్యలు చేశారు.

అంబానీ, ఆదానీలపై సంచలన వ్యాఖ్యలు చేసిన రాందేవ్ బాబా

అంబానీ, ఆదానీలపై సంచలన వ్యాఖ్యలు చేసిన రాందేవ్ బాబా

ఒక వ్యాపారవేత్త తన సమయంలో 99% కాలాన్ని తన కోసమే వెచ్చిస్తాడని, తన స్వప్రయోజనాల కోసమే వినియోగిస్తున్నారని పేర్కొన్న బాబా రాందేవ్, కానీ సాధువులు అందరి మేలు కోసం తమ సమయాన్ని వినియోగిస్తారని చెప్పుకొచ్చారు. అంబానీ, అదాని, టాటా, బిర్లాల సమయం కన్నా తన సమయమే విలువైందని ఆయన చెప్పుకొచ్చారు. హరిద్వార్ నుంచి తను మూడు రోజుల పర్యటనలో భాగంగా గోవాకు వచ్చినట్టు పేర్కొన్న రాందేవ్ బాబా కాలం విలువైందని చెప్పుకొచ్చారు.

గోవాలో ఓ కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రాందేవ్ బాబా

గోవాలో ఓ కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రాందేవ్ బాబా


గోవాలో పతంజలి కంపెనీ సీఈవో, తన సహచరుడు అయిన ఆచార్య బాలకృష్ణను సన్మానించే కార్యక్రమంలో పాల్గొన్న రాందేవ్ బాబా గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్ సమక్షంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాలం యొక్క గొప్పతనాన్ని చెబుతూ ఆ మేరకు దేశంలోని కార్పోరేట్ దిగ్గజాలను గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. వారి సమయం స్వార్ధంతో కూడుకున్నదని, కానీ తమ సమయం నిస్వార్ధమైనదని పేర్కొన్నారు. బాలకృష్ణను సన్మానించిన అనంతరం రాందేవ్ బాబా ఆయన పైన కూడా ప్రశంసల వర్షం కురిపించారు.

భారతదేశ కుబేరులపై రాందేవ్ బాబా వ్యాఖ్యలపై ఆసక్తి

భారతదేశ కుబేరులపై రాందేవ్ బాబా వ్యాఖ్యలపై ఆసక్తి

బాలకృష్ణ తన వృత్తిపరమైన పాలనా పారదర్శక నిర్వహణ మరియు జవాబుదారీతనం కారణంగా మూతపడే స్థితిలో ఉన్న పతంజలి కంపెనీని 40 వేల కోట్ల టర్నోవర్ సాధించేలా చేశారని కొనియాడారు. పతంజలి వంటి సామ్రాజ్యాన్ని స్థాపించడం ద్వారా భారతదేశాన్ని పరమ వైభవశాలిగా మార్చాలనే కలను సాకారం చేసుకోవచ్చని రాందేవ్ బాబా పేర్కొన్నారు. మొత్తానికి భారత దేశ కుబేరులపై, పారిశ్రామిక దిగ్గజాలపై తాజాగా యోగా గురు రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారాయి.

గతంలో బాలీవుడ్ ఇండస్ట్రీపై రాందేవ్ బాబా షాకింగ్ వ్యాఖ్యలు

గతంలో బాలీవుడ్ ఇండస్ట్రీపై రాందేవ్ బాబా షాకింగ్ వ్యాఖ్యలు

గతంలో బాలీవుడ్ ఇండస్ట్రీపై రాందేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ అగ్ర నటులు డ్రగ్స్ సేవిస్తున్నారు అంటూ రాందేవ్ బాబా చేసిన సంచలన ఆరోపణలు సినీ వర్గాల లోనే కాకుండా సామాన్య ప్రజల్లో చర్చనీయాంశం కాగా ఇక రాజకీయాల్లో కూడా డ్రగ్స్ వినియోగం ఉందంటూ రాందేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు చేసి దుమారం రేపారు. అంతేకాదు మహిళల వస్త్రధారణపై గతంలో రాందేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు చేశారు.

మహిళలు బట్టలు లేకున్నా బాగుంటారన్న రాందేవ్ బాబా

మహిళలు బట్టలు లేకున్నా బాగుంటారన్న రాందేవ్ బాబా

మహారాష్ట్ర థానేలోని పతంజలి యోగ పీఠం, అలాగే ముంబై మహిళల పతంజలి యోగ సమితి సంయుక్తంగా యోగా సైన్సు శిబిరాన్ని నిర్వహించగా ఈ శిబిరంలో పాల్గొన్న రామ్ దేవ్ బాబా షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. మహిళలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన మీకు చీరలు ధరించేందుకు టైం లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడైనా ఇంటికి వెళ్లి చీరలు ధరించి రావచ్చు అని పేర్కొన్నారు. మహిళలు చీరలలో, సల్వార్ సూట్ లలో బాగుంటారని పేర్కొన్న రాందేవ్ బాబా తనకు అయితే మహిళలు ఏం ధరించకపోయినా బాగుంటారు అంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మళ్ళీ అంబానీ, ఆదానీలపై వ్యాఖ్యలు చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+