వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైలు ఢీకొని టెక్కీ మృతి: ప్రియురాలిపై అనుమానాలు!

|
Google Oneindia TeluguNews

Mystery death of techie on Kolkata tracks
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బఘాజతిన్ రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం రాత్రి రైలు ఢీకొని చనిపోయిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సుమన్ దాస్(21) మరణం మిస్టరీగా మారింది. అయితే అతని మరణం వెనక ఏదైనా కుట్ర దాగివుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రమాదం జరిగిన సమయంలో అతని వెంట ఉన్న ప్రియురాలును ప్రశ్నించారు. రైలు వస్తున్న శబ్ధం వినిపించినప్పటికీ రైలు పట్టాలపైనే ఎందుకు నడిచారనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. సాల్ట్ లేక్‌లో నివాసం ఉండే సుమన్ దాస్ తన ప్రియురాలును కలిసేందుకు ఆదివారం సాయంత్రం జాదవ్‌పూర్ వెళ్లాడు. ఆ తర్వాత తన ప్రియురాలుతోపాటు బఘాజతిన్ రైల్వే స్టేషన్ వైపు వెళ్లే రైలు పట్టాలపై నడుచుకుంటూ వెళుతున్నారు. అదే సమయంలో స్పీడుగా వచ్చిన రైలు సుమన్ దాస్‌ను ఢీకొనడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, అతని ప్రియురాలు మాత్రం తనను తాను రక్షించుకుంది. ఈ విషయాలను స్వయంగా మృతుడు సుమన్ ప్రియురాలు పోలీసులకు తెలిపింది.

ఈ ప్రమాదం రాత్రి 8 గంటల సమయంలో జరిగిందని సుమన్ ప్రియురాలు అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న సుమన్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. సోమవారం సుమన్ మృత దేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం పోలీసులు అతని పార్థీవ దేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.

సుమన్ కుటుంబ సభ్యులను కూడా ఈ ఘటనపై పోలీసులు విచారించారు. కాగా సుమన్ కుటుంబ సభ్యులు మాత్రం ఇప్పటి వరకు రాతపూర్వకమైన ఫిర్యాదు ఇవ్వలేదని పోలీసులు తెలిపారు. సుమన్ మరణంపై తమకు అనుమానాలున్నాయని, ఈ కేసులో తమకు సహాయం చేయాలని అతని కుటుంబ సభ్యులు తమను కోరారని పోలీసులు పేర్కొన్నారు.

English summary
The death of a 21-year-old IT student under mysterious circumstances has left police wondering if foul play is involved.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X