శశికళ సీఎం కాకూడదు: దేశానికే మచ్చ వస్తుంది, కర్ణాటకలో ఆందోళన

తమిళనాడు ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్న శశికళను అడ్డుకోవడానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ కర్ణాటకలో ఆందోళనలు మొదలైనాయి.

మైసూరు: తమిళనాడు ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్న శశికళను అడ్డుకోవడానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ కర్ణాటకలో ఆందోళనలు మొదలైనాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కోంటున్న శశికళను తమిళనాడు సీఎం చెయ్యరాదని మైసూరు నగరంలో ఆందోళనకు దిగారు.

మైసూరులోని ప్రజావంత నాగరిక వేదిక ఆధ్వర్యంలో నగరంలోని పోలీసు ప్రధాన కార్యాలయం ముందు వేదిక కార్యకర్తలు శశికళకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంలో శశికళ ఫ్లక్సీలకు రంగు పూసి నిరసన వ్యక్తం చేశారు.

Mysuru Prajnavantha Nagarikara Vedike organized protest against AIADMK leader Sasikala.

శశికళను సీఎం చెయ్యరాదన్ని, ఈ విషయంలో ప్రణబ్ ముఖర్జీ జోక్యం చేసుకోవాలని మనవి చేస్తూ పోస్టుకార్డులు మీద రాసి రాష్ట్రపతి కార్యాలాయానికి పంపించడానికి ఫోస్టు బాక్స్ ల్లో వేశారు. ఈ సందర్బంగా వేదిక నాయకులు మాట్లాడుతూ శశికళ మీద అక్రమాస్తుల కేసు తీర్పు సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉందని గుర్తు చేశారు.

అక్రమాస్తుల కేసు తీర్పుసుప్రీం కోర్టులో వెలువడుతున్న సమయంలో శశికళ తమిళనాడు సీఎం అయితే దేశానికే చెడ్డపేరు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ బాధ్యతలు స్వీకరిస్తే దేశంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ నాయకులు ఆమె తీరునే అనుసరిస్తారని. అది దేశానికి మంచిది కాదని వేదిక నాయకులు మీడియాకు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+