
జగన్ మద్దతు: 4వసారి సీఎంగా రంగస్వామి ప్రమాణం -పుదుచ్చేరిపై బీజేపీ పట్టు -కేబినెట్ కూర్పుపై కసరత్తు
దక్షిణ భారతంలో అసెంబ్లీతో కూడిన ఏకైక కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ఆలిండియా ఎన్ఆర్ కాంగ్రెస్ చీఫ్ ఎన్.రంగస్వామి శుక్రవారం పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఇంచార్జి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈ మధ్యాహ్నం రాజ్ భవన్ లో రంగస్వామి చేత ప్రమాణం చేయించారు. రంగస్వామి ఈ పదవిని చేపట్టడం ఇది నాలుగోసారి.
షాకింగ్: కొవిడ్ రోగులకు black fungus -మరో మహహ్మారి విజృంభణ -పెరిగిన మ్యూకర్‌మైకోసిస్ కేసులు

అంతా కమలం కంట్రోల్‌లో..
మొత్తం 30 స్థానాలున్న పుదుచ్చేరి అసెంబ్లీకి ఇటీవల వెల్లడైన ఫలితాల్లో ఎన్ఆర్ కాంగ్రెస్-బీజేపీ కూటమి సాధారణ మెజార్టీ సాధించింది. ఎన్ఆర్సీకి 10 సీట్లు, బీజేపీకి 6 సీట్లు దక్కాయి. ఇండిపెండెంట్లు 6 స్థానాల్లో, ప్రతిపక్ష డీఎంకేకు 6, కాంగ్రెస్ కు 2 సీట్లు దక్కాయి. పేరుకు పెద్ద పార్టీగా, దానికి సారధిగా రంగస్వామి ఉన్నప్పటికీ, పెత్తనం మాత్రం బీజేపీనే చెలాయించబోతున్నట్లు అక్కడి విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో బీజేపీ జూనియర్ భాగస్వామిగా ఉన్న బీహార్, ఏపీ, జమ్మూకాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో అక్కడి స్థానిక పార్టీలను ఆగం పట్టించిన తీరే పుదుచ్చేరిలోనూ చోటుచేసుకోబోతోందని అంటున్నారు. ఈ వాదనకు బలం చేకూర్చుతూ..
oxygen:జగన్ సంచలనం, కేంద్రం నో -ప్రైవేటు ఆస్పత్రులకు మరో ఝలక్ -ఏపీలో ఫీవర్ సర్వే షురూ

బీజేపీకి డిప్యూటీ సీఎం, కీలక శాఖలు
అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ఆర్ కాంగ్రెస్, బీజేపీలు పొత్తు పెట్టుకుని పోటీ చేసినప్పటికీ, ఫలితాల తర్వాత బీజేపీ వ్యూహాత్మక మౌనం పాటించింది. యానాంలో రంగస్వామి ఓటమిని సాకుగా చూపి, ఒక దశలో సీఎం సీటును సైతం ఆశించిన కమలనాథులు.. రోజుల సస్పెన్స్ తర్వాతగానీ రంగస్వామి సీఎం అభ్యర్థిత్వానికి బహిరంగంగా మద్దతు పలకలేదు. ఇవాళ సీఎం రంగస్వామి ఒక్కరే ప్రమాణం చేశారు. కాంగ్రెస్ సర్కారును పడగొట్టడంలో కీలక పాత్రపోషించి, ఇప్పుడు బీజేపీలో ఉన్న నమశ్శివాయానికి ఉప ముఖ్యమంత్రి పదవి దక్కనుంది.గతంలో ఇటువంటి సంప్రదాయం ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో లేదు. అలాగే కీలక శాఖలన్నీ బీజేపీకే దక్కుతాయని సమాచారం.

జగన్ మద్దతు.. సీఎం ఓటమి..
పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏపీలోనూ విచిత్ర రాజకీయాలు చోటుచేసుకున్నాయి. తూర్పుగోదావరి జిల్లాను ఆనుకునే ఉండే కేంద్ర పాలిత ప్రాంతం యానాం నుంచి పుదుచ్చేరి సీఎం అభ్యర్థి రంగస్వామి పోటీ చేయగా, ఏపీ అధికార పార్టీ వైసీపీ ఆయనకు మద్దతు తెలిపింది. ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సహా పలువురు వైసీపీ నేతలు నేరుగా రంగస్వామి తరఫున ప్రచారం చేశారు. అయితే అనూహ్య రీతిలో రంగస్వామి యానాంలో ఓడిపోయారు. స్వతంత్ర అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్ 656 ఓట్ల తేడాతో రంగస్వామిపై గెలుపొందారు. కేంద్రంతో వ్యవహారాలు, యానాం మాజీ ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావుతో సంబంధాల రీత్యా జగన్.. బీజేపీ మిత్రురాలైన ఎన్ఆర్ కాంగ్రెస్‌కు మద్దతిచ్చారు. బీజేపీ కనుసన్నల్లో రంగస్వామి సర్కారు ఏవిధంగా మనగలుగుతుందో చూడాలి.రంగస్వామి 2001లో మొదటిసారి, 2006లో రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మంత్రివర్గ సహచరులతో భేదాభిప్రాయాలు రావడంతో 2008లో సీఎం పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు నాలుగోసారి బీజేపీ మద్దతుతో గద్దెనెక్కారు.