వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సహజీవనం, మోసం: అసెంబ్లీ స్పీకర్ పై కేసు

|
Google Oneindia TeluguNews

ఇటానగర్: అతను అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్. ఉన్నత పదవిలో ఉంటూ ప్రజాసేవ చెయ్యవలసిన ఆయనగారు ఓ మహిళను వివాహం చేసుకుంటానని నమ్మించి కొన్ని సంవత్సరాలు సహజీవనం చేసి ఆమెను గాలికి వదిలేశారు.

అరుణాచల్ ప్రదేశ్ స్పీకర్ నాబం రబియాపై స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వివిద కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు. దోయ్ ముఖ్ శాసన సభ నియోజక వర్గం నుంచి రబియా అసెంబ్లీకి ఎన్నికైనారు.

ఆయన ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్ గా పని చేస్తున్నారు. అయితే గత నాలుగు సంవత్సరాల నుంచి ఓ మహిళతో సహజీవనం సాగిస్తున్నాడు. వివాహం చేసుకుంటానని ఆమెను నమ్మించాడు. అయితే గత ఆరు నెలల నుంచి ఈ రోజు రేపు అంటూ కాలం గడుపుతున్నాడు.

గత మూడు నెలల నుంచి ఆమె ఇంటికి వెళ్లకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. అంతే కాకుండ ఆమె అనేక మందితో లైంగిక సంబంధం పెట్టుకునిందని, తాను ఎలా వివాహం చేసుకుంటానని స్పీకర్ రిబియా ప్రచారం చేస్తున్నాడు.

Nabam Rebia has been booked on the charge of physically assaulting

ఫోన్ చేసినా స్పందించడం లేదని, తనను మానసికంగా, శారీరకంగా వేదిస్తున్నాడని న్యాయం చెయ్యాలని ఆ మహిళ రాష్ట్ర మహిళా కౌన్సిల్ ను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. మహిళా కమిషన్ కౌన్సిల్ వారం లోపు సమాధానం ఇవ్వాలని రిబియాకు నోటీసులు జారీ చేసింది.

అయితే నోటీసులకు సైతం రిబియా స్పందించకపోవడంతో ఆయన మీద కేసు నమోదు అయ్యింది. ఒక రాజకీయ నాయకుడై ఉండి చట్టవిరుద్దంగా వ్యవహరిస్తున్న రిబియా మీద ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా కౌన్సిల్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

English summary
Live-in partner: Arunachal Pradesh assembly Speaker Nabam Rebia has been booked on the charge of physically and mentally assaulting case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X