వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిపో పైకప్పు కూలి దుర్మరణం: ప్రతి ఒక్కరికీ రూ. 7.50 లక్షలు పరిహారం, ఉద్యోగం: సీఎం పళనిసామి !

ఆర్ టీసీ డిపో విశ్రాంతి భవనం కూలి 8 మంది మృతిమృతుల కుటుంబ సభ్యులకు రూ. 7.50 లక్షలు నష్టపరిహారంప్రతి కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం, వైద్యఖర్చులు, సీఎం ఎడప్పాడి పళనిసామి

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు రవాణా శాఖకు చెందిన భవనంపై కప్పుకుప్పకూలిపోయి మరణించిన 8 మంది కుటుంబ సభ్యులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. ప్రమాదంలో మరణించిన ప్రతి ఒక్కరికీ రూ. 7.5 లక్షల చొప్పున నష్టపరిహారం అందిస్తామని ప్రకటించింది.

శుక్రవారం ఉదయం తమిళనాడులోని నాగపట్టినం జిల్లాలోని పొరయూర్ ప్రాంతంలో ఆ రాష్ట్ర టీఎన్ ఎస్ టీసీ డిపోలోని విశ్రాంతి భవనం పై కప్పుకూలిపోవడంతో ఆ శాఖకు చెందిన 8మంది ఉద్యోగులు దుర్మరణం చెందారు. ముగ్గరికి తీవ్రగాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Nagapattinam mishap: Tamil Nadu CM announces Rs 7.5 lakh each to family of the dead

అనేక మంది ఉద్యోగులకు గాయాలైనాయి. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి మీడియాతో మాట్లాడుతూ మృతుల కుటుంబ సభ్యులకు రూ. 7.50 లక్షల నష్టపరిహారం అందిస్తామని, ప్రతి కుటుంబంలో ఒక్కరికి రవాణా శాఖలో ఉద్యోగం ఇస్తామని హామి ఇచ్చారు.

తీవ్రగాయాలైన వారికి పత్రి ఒక్కొరికి రూ. 1.50 లక్షలు, గాయాలైన వారికి ఒక్కొక్కరికి రూ. 50 వేలు పరిహారం ఇస్తామని, వారి వైద్య ఖర్చులు ప్రభుత్వం ఇస్తుందని పళనిసామి హామి ఇచ్చారు. తమిళనాడు మంత్రులు ఓఎస్. మణియన్, ఎంఆర్. విజయభాస్కర్, నాగపట్టినం జిల్లా కలెక్టర్, జిల్లా పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. తీవ్రగాయాలైన వారికి మెరుగైన చికిత్స అందించాలని ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

English summary
Expressing grief over the death of eight persons in the collapse of a transport depot building in Nagpattinam district Friday morning, Tamil Nadu chief minister Edappadi K Palaniswami announced Rs 7.5 lakh each as solatium to the family of the victims.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X