వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైలులో ‘నాగినీ’ డ్యాన్స్ షో: వేటు (వీడియో)

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: గణతంత్ర దినోత్సవం సందర్బంగా జైలులో మహిళలతో అసభ్యంగా డ్యాన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఇలా అత్యుత్సాహం ప్రదర్శించిన ముగ్గురు అధికారులను సస్పెండ్ చేశామని కర్ణాటక జైళ్ల శాఖ డీజీపీ కే. సత్యనారాయణ తెలిపారు.

ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కర్ణాటకలోని విజయ్ పూర్(గతంలో బీజాపూర్) సెంట్రల్ జైలులో గణతంత్ర దినోత్సవం సందర్బంగా సాంసృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

ఇదే సమయంలో బయట నుంచి రికార్డింగ్ డ్యాన్స్ లు వేసే మహిళలను జైలు ఆవరణంలోకి తీసుకు వెళ్లారు. తరువాత ఖైదీల ముందు ఏర్పాటు చేసి స్టేజ్ మీద మహిళల దగ్గర నాగినీ డ్యాన్స్ లు చేయించారు. అక్కడితో సంతోషించని జైళ్ల శాఖ సిబ్బంది రూ. నోట్లు తీసుకుని మహిళా డ్యాన్సర్ల మీద విసిరివేశారు.

ఈ తతంగం మొత్తం మొబైల్ లో వీడియో తీసిన వ్యక్తి జైళ్ల శాఖ అధికారులకు ఇచ్చారు. సోషల్ మీడియాలో ఈ డ్యాన్స్ షో హల్ చల్ చేసింది. విషయం తెలుసుకున్న జైళ్ల శాఖ డీజీపీ సత్యనారాయణ సీరియస్ అయ్యారు. ఉన్నత స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ముగ్గురు అధికారుల మీద వేటు పడింది.

English summary
Inmates at a jail in Vijaypur of Karnataka were rewarded for their good behaviour with a dance show.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X