మాజీ మంత్రి కుమార్తెకు వేధింపు, సెక్స్ రాకెట్: పిసిసి వైస్ రిజైన్

సెక్స్ రాకెట్ నడపడం, లైంగిక వేధింపుల ఆరోపణల కారణంగా బీహార్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు బ్రిజేష్ పాండే బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. ఓ మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత కుమార్తె పైన బ్రిజేష్ లైంగిక వే

పాట్నా: సెక్స్ రాకెట్ నడపడం, లైంగిక వేధింపుల ఆరోపణల కారణంగా బీహార్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు బ్రిజేష్ పాండే బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. ఓ మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత కుమార్తె పైన బ్రిజేష్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయన పైన కేసు నమోదు చేశారు.

సీఐడీ మహిళా విభాగం వారు పోస్కో చట్టం కింద కేసు నమోదు చేయాలని ఉత్తర్వులు జారీ చేయటంతో దీనిపై దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసు అధికారులు తెలిపారు.

ప్రియదర్శిని అనే మహిళ తన సోదరుడు, బ్రిజేశ్‌ పాండేతో కలిసి బెదిరింపులకు పాల్పడిందని, బ్రిజేశ్‌ సెక్స్‌ రాకెట్‌ని కూడా నడుపుతున్నాడని బాధితురాలు ఆరోపించింది.

Named in POCSO case, Bihar Congress leader quits

బ్రిజేశ్‌ తనను ఒక పెద్ద నాయకుడిగా పరిచయం చేసుకున్నాడని, తనను చాలాసార్లు బెదిరించాడని చెప్పింది.

మరోవైపు, నిందితులకు ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించటంతో వారు పరారీలో ఉన్నారు. ఇదే సమయంలో బ్రిజేష్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఫ్యాక్స్ ద్వారా రాజీనామా లేఖను పంపారు.

తన వల్ల పార్టీ ఇబ్బందుల్లో పడకూడదని ఈ నిర్ణయం తీసుకున్నానని, అసలు తన పేరును ఆమె ఎందుకు ప్రస్తావిస్తోందో తెలియడం లేదని, ఎవరో తన పైన కుట్ర చేస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. బ్రిజేశ్‌ పంపిన రాజీనామాను కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షులు ఆమోదించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+