నమీబియా చీతా సాషా కిడ్నీ వ్యాధితో కునో నేషనల్ పార్కులో మృతి

భోపాల్: నమీబియా నుంచి భారతదేశానికి తీసుకొచ్చిన ఎనిమిది చిరుతల్లో ఒక చిరుత కిడ్నీ వ్యాధి కారణంగా బాధపడుతూ సోమవారం మరణించింది. గత సెప్టెంబర్ నెలలో ప్రధాని నరేంద్ర మోడీ ఎనిమిది చిరుతలను మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కునో నేషనల్ పార్క్‌లోని ప్రత్యేక ఎన్‌క్లోజర్‌లోకి విడుదల చేశారు. అయితే, వాటిలో సాషా అనే ఆడ చీతా సోమవారం అనారోగ్యంతో మృతి చెందింది. కిడ్నీ సంబంధిత వ్యాధితో అది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.

జనవరి 22న సాషా అస్వస్థతకు గురైంది. దీంతో ఆరోగ్య పరీక్షల నిమిత్తం క్వారంటైన్‌కు తరలించారు. రక్త పరీక్షలతోపాటు అల్ట్రాసౌండ్ స్కానింగ్‌లో ఆ చీతాకు మూత్రపిండాల సమస్య ఉన్నట్లు తేలింది. దాని ఆరోగ్య చరిత్రను పూర్తిస్థాయిలో విశ్లేషంగా.. భారత్‌కు తీసుకొచ్చే ముందే చీతాకు ఈ సమస్య ఉన్నట్లు తేలిందని అధికారులు తెలిపారు.

Namibian Cheetah Sasha Dies due to Kidney Disease, In Kuno National Park Madhya Pradesh

స్థానిక వైద్యుతోపాటు నమీబియా, దక్షిణాఫ్రికాలకు చెందిన నిపుణులు నిత్యం వైద్యసేవలు అందించారని చెప్పారు. ఈ క్రమంలోనే పరిస్థితి విషమించి సోమవారం సాషా మరణించిందని అధికారులు వెల్లడించారు.

కాగా, నమీబియా నుంచి 4-6 ఏళ్ల వయస్సున్న ఐదు ఆడ, మూడు మగ చీతాలు భారత్ తీసుకొచ్చారు. మిగితా ఏడు చీతాలు ప్రస్తుతం కునో జాతీయ పార్కులో స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. మిగితా ఏడు చీతాలు కూడా ఆరోగ్యంగా ఉన్నాయి. వేట కొనసాగిస్తున్నాయని అధికారులు తెలిపారు. ఇటీవల దక్షిణాఫ్రికా నుంచ ితీసుకొచ్చిన 12 చీతాలు ప్రస్తుతం క్వారంటైన్లో ఆరోగ్యంగా ఉన్నాయని చెప్పారు.

ఈ క్రమంలో కునో నేషనల్ పార్క్ ఇప్పుడు 20 చిరుతలకు నిలయంగా ఉంది. రాబోయే దశాబ్దంలో ఆసియా దేశానికి డజన్ల కొద్దీ ఆఫ్రికన్ చిరుతలను పరిచయం చేయడానికి దక్షిణాఫ్రికా భారతదేశంతో ఒక ఒప్పందంపై సంతకం చేసింది. ప్రపంచంలోని మొట్టమొదటి ఇంటర్‌కాంటినెంటల్ ట్రాన్స్‌లోకేషన్ ప్రాజెక్ట్ దేశంలో చీతాలను తిరిగి ప్రవేశపెట్టడం లక్ష్యంగా పెట్టుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+