ఐటీ హబ్ లో ఎన్ టీఆర్ శతజయంతి వేడుకలు, దుమ్ములేపిన ప్రవాసాంధ్రులు !

బెంగళూరు/హైదరాబాద్: తెలుగు సినిమా అంటే టక్కున గుర్తుకు వచ్చే నటుడు నందమూరి తారక రామారావు. ఆయన లేని వెండి తెర ఇప్పటికి వెలవెలపోతున్నది. ఎన్నో పౌరానిక, చారిత్రాక కథలకు, పాత్రలకు ప్రాణం పోసి ఇప్పటికి వెండి తెరమీద వెలుగుతున్న ఏకైక కథానాయకుడు ఎన్ టీఆర్ అని చెప్పడం కొత్తకాదు. ఖండాతర ఖ్యాతిని గడించిన విశ్వ విఖ్యాత నటనా సర్వభౌముడు నందమరి తారక రామారావు.

నందమూరి తారక రామారావు అంటే శ్రీక్రిష్ణుడు, రాముడు, వెంకటేశ్వరుడు, భీముడు, ధుర్యోదనుడు, కర్ణుడు ఇలా చెప్పకుంటూ పోతే చాలా క్యారెక్టర్లు చేశారు, నటనలో, దర్శకత్వంలో తనకు ఎవ్వరు సాటిరారు అని నందమూరి తారక రామరావ్ నిరూపించుకున్నారు. సినిమా రంగంలోనే కాదు రాజకీయంగా తెలుగు సినీ చరిత్రలో ఎవ్వరికిలేని గుర్తింపు ఒక్క ఎన్ టీఆర్ కు మాత్రమే ఉంది.

Nandamuri fans

సినిమా రంగంలో ఉంటూ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో సొంతంగా తెలుగుదేశం అనే రాజకీయ పార్టీ పెట్టిన ఎన్ టీఆర్ ఏకంగా సీఎం అయ్యారు. సినిమా రంగంలో, రాజకీయాల్లో తనకు ఎవరు సాటిరారు అని మొదటి సారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నిరూపించుకున్న స్టార్ హీరో ఎన్ టీఆర్. అలాంటి ఎన్ టీఆర్ శతజయంతి ఉత్సవాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పాటు కర్ణాటక, తమిళనాడుతో పాటు దేశ విదేశాల్లో జరుపుకున్నారు.

Nandamuri fans

కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలోని హలసూరులో ఎన్ టీఆర్ శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఎన్ టీఆర్ శత జయంతి ఉత్సవాలకు కర్ణాటక జూనియర్ ఎన్ టీఆర్ అభిమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాణిక్యం, ప్రముఖ కన్నడ నిర్మాత, స్యాండిల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ తో చక్రవ్యూహా సినిమాను నిర్మించిన ఆయన స్నేహితుడు ఎన్ కే. లోహిత్ ను ఆహ్వానించారు.

ఎన్ టీఆర్ శత జయంతి వేడుకల సందర్బంగా హలసూరులో పండుగ వాతావరణం నెలకొనింది. ఎక్కడ చూసినా ఎన్ టీఆర్ పాటలు మోరుమ్రోగిపోయాయి. ఎన్ టీఆర్ శతజయంతి వేడుకల సందర్బంగా హలసూరులో అన్నదానం చేశారు. ఎన్ టీఆర్ అభిమానులు, తెలుగు సంఘాల నాయకులకు ఈ కార్యక్రమం నిర్వహకులు బహుమతులు, షీల్డ్ లు అందించారు.

Nandamuri fans

ఎన్ టీఆర్ శత జయంతి వేడుకులకు హాజరైన ప్రవాసాంధ్రును పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించి ఎన్ టీఆర్ షీల్డ్ లు అందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్ టీఆర్ శతజయంతి వేడుకలు పొరుగు రాష్ట్రం అయిన కర్ణాటకలో ఇంత గ్రాండ్ గా చెయ్యడం చాలా సంతోషంగా ఉందని డాక్టర్ రాజ్ కుమార్ అభిమానులు, ఎంజీఆర్ అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.

హలసూరుకు చెందిన గోల్డన్ స్టార్ ఫ్యాన్స్ వ్యవస్థాపకుడు బాలకృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జీబీ. దినకర్ రెడ్డి, జార్జ్ బోస్, వెంకోబ, తిరుపతి, బాలకృష్ణ, డేవిడ్, చిన్నరాజు, గంగాధర్, ఐరన్ రాజు, బిన్నిపేట్ బ్యాచిలర్ భాస్కర్, బాల, వెంకోబ, సుబ్రమణి, సురేష్, అన్నప్ప, హరి ఇంజనీర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హలసూరులోని ప్రవాసాంధ్రులతో పాటు కన్నడ, తమిళ ప్రజలు అధిక సంఖ్యో పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+