రోజుకు రూ. లక్ష ఆదాయం.. పాల వ్యాపారంలో దూసుకెళ్తున్న వృద్ధ దంపతులు

సాధారణంగా వృద్ధాప్యంలో కృష్ణా.. రామా.. అంటూ ఓ మూలన కూర్చొంటారు. పెట్టింది తిని.. సైలెంట్ గా ఉంటారు. కానీ వృద్ధ దంపతులు మాత్రం ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్ అని నిరూపిస్తున్నారు. 80 ఏళ్ల వయసులోనూ సాఫ్ట్ వేర్ కుర్రాళ్లు నెలంతా కష్టపడినా సంపాదించలేని ఆదాయాన్ని ఒక్క రోజులో సంపాదిస్తున్నారు. నేటి యువతకు ఎంతో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. పాల వ్యాపారంలో రోజుకు రూ. లక్ష వరకు ఆదాయం సంపాదిస్తూ ఔరా అనిపిస్తున్నారు. మహారాష్ట్రలోని ఈ వృద్ధ దంపతులు ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. సుమారు 50 ఏళ్ల క్రితం రెండు గేదెలతో మొదలైన వారి ప్రస్థానం.. ఇప్పుడు అంచలంచెలుగా ఎదిగి రోజుకు రూ. లక్ష సాధించే స్థాయికి చేరారు.

ఎనిమిదిపదుల వయసులో చాలా మంది తమ పని తాము చేసుకోవడానికే చాలా ఇబ్బందులు పడుతుంటారు. కన్నబిడ్డలు, మనవళ్లు.. మనవరాళ్లపై ఆధారపడతారు. కానీ మహారాష్ట్రలోని నాందేడ్ కు చెందిన ఈ వృద్ధ జంట మాత్రం ప్రతిరోజూ కొన్ని వందల కుటుంబాల్లో వెలుగును నింపుతుంది. డెయిరీ బిజినెస్ లో రోజుకు రూ. లక్ష ఆదాయం పొందుతూ నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. చంద్రకళాబాయ్, ప్రభుప్పఅలంకానే దంపతులు గత 50 ఏళ్లుగా పాల వ్యాపారంలో విజయం సాధిస్తూ వస్తున్నారు. 50 ఏళ్ల క్రితం రెండు గేదెలతో మొదలైన వారి ప్రస్థానం.. ఇప్పుడు రోజుకు రూ. లక్ష సంపాదించే స్థాయికి చేరింది.

50 ఏళ్ల క్రితం ఈ దంపతులు తమకున్న అది కొద్ది ప్రాంగణంలో, తక్కువ వనరులతో డెయిరీ బిజినెస్ ప్రారంభించారు. రెండు గేదెలతో సంప్రదాయ పద్ధతిలో పాల వ్యాపారం మొదలు పెట్టారు. వ్యాపారంలో నిజాయితీ, సమయానికి పాల సరఫరా, నాణ్యత, పాల స్వచ్ఛత.. పలు కారణాల వల్ల స్థానికంగా వారికి మంచి గుర్తింపు వచ్చింది. అలా క్రమంగా తమ వ్యాపారాన్ని విస్తరించుకుంటూ వచ్చారు. ప్రస్తుతం వారి వద్ద 70 కు పైగా గేదెలు ఉన్నాయి. అధిక పాలను అందించే ముర్రా, జఫ్ఫెరాబడి, పాందార్ పురి గేదెలు కూడా వారి వద్ద ఉన్నాయి.

ఈ వయసులోనూ చంద్రకళాబాయ్ పాల వ్యాపారాన్ని స్వయంగా చూసుకుంటుంది. పాలు పితకడం, పాలతో వివిధ డెయిరీ ఉత్పత్తులను తయారు చేయడం లాంటివి ఆమెనే చేస్తుంది. పాలు మాత్రమే కాకుండా పెరుగు, పాల ఉత్పత్తులు, స్వీట్లు, స్నాక్స్ కూడా విక్రయిస్తారు. అలాగే రోజూ రెండు క్వింటాళ్ల మావా కూడా విక్రయిస్తారు. తమ తాతముత్తాతల కాలం నుంచి డెయిరీ బిజినెస్ పైనే ఆధారపడినట్లు చెప్పుకొచ్చిందీ జంట.

Nanded Elderly Couple Milks Rs 1 Lakh Daily from Dairy Empire

ప్రతిరోజూ 500 లీటర్ల పాలను విక్రయిస్తారు. అలా వారికి రోజుకు రూ. 40 వేల వరకు వస్తాయి. అలాగే ఇతర పాల ఉత్పత్తులను విక్రయిస్తారు. పనీర్ కేజీ రూ. 360 చొప్పున అమ్ముతారు. మావా ప్రతిరోజూ రెండు క్వింటాళ్లు విక్రయిస్తారు. కేజీ రూ. 280 చొప్పున విక్రయిస్తారు. మొత్తం పాలు, పాల ఉత్పత్తులు కలిపి వీరికి రోజూ రూ. లక్ష ఆదాయం వస్తుంది. ప్రస్తుతం వీరి స్టోరీ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+