కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యల ఎఫెక్ట్... ముంబైలో శివసేన-బీజేపీ రచ్చ రచ్చ... రాళ్ల దాడులు...

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేపై కేంద్రమంత్రి నారాయణ్ రాణే చేసిన వ్యాఖ్యలు శివసేన-బీజేపీ మధ్య చిచ్చు రేపాయి. రాష్ట్రవ్యాప్తంగా శివసేన,బీజేపీ కార్యకర్తలు పరస్పరం ఘర్షణకు దిగుతున్నారు. మంగళవారం(ఆగస్టు 24) ముంబైలో ఇరు వర్గాలు పరస్పరం రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి లాఠీచార్జితో చెదరగొట్టారు.

నారాయణ రాణే వ్యాఖ్యలను నిరసిస్తూ శివసేన కార్యకర్తలు ముంబైలోని ఆయన నివాసాన్ని ముట్టడించేందుకు యత్నించారు.బీజేపీ కార్యకర్తలు వారిని అడ్డగించడంతో ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆపై ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్నారు. ఈ సందర్భంగా నారాయణ్ రాణేకి వ్యతిరేకంగా శివసేన కార్యకర్తలు... ఉద్దవ్ థాక్రేకి వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. పోలీసులు అందరినీ చెదరగొట్టడంతో ఉద్రిక్తతలకు తెరపడింది.

narayan rane remarks effect clashes between shiv sena and bjp in mumbai streets over

అనంతరం ఆ రోడ్డును పోలీసులు బ్లాక్ చేశారు. ఆ మార్గంలో వెళ్లాల్సిన వాహనాలను మరో దారి గుండా మళ్లిస్తున్నారు. కేంద్రమంత్రి నివాసంతో పాటు ఆ మార్గంలో భారీగా పోలీసులను మోహరించారు.

మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలోనూ శివసేన-బీజేపీ మద్దతుదారులు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. నాగ్‌పూర్,నాసిక్‌లోని బీజేపీ కార్యాలయంపై శివసేన కార్యకర్తలు రాళ్లు విసిరారు.

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ థాక్రేకు స్వాతంత్ర్యం వ‌చ్చి ఎన్నేళ్లయిందో కూడా తెలియ‌ద‌ని కేంద్రమంత్రి నారాయ‌ణ్ రాణే విమ‌ర్శించారు. స్వాతంత్ర్య దినోత్స‌వ ప్ర‌సంగం సంద‌ర్భంగా ఉద్ధ‌వ్ ఇది ఎన్నో స్వాతంత్ర్య దినోత్స‌వ‌మో ప‌క్క‌నున్న వారిని అడిగి చెప్పార‌ని... ఆ సమయంలో తాను గనుక అక్క‌డ ఉండి ఉంటే థాక్రే చెంప ప‌గల‌గొట్టేవాడిన‌ని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చి ఎన్నేళ్లయిందో కూడా తెలియ‌క‌పోవ‌డం సిగ్గుచేట‌ని మండిపడ్డారు.

నారాయణ్ రాణే వ్యాఖ్యలపై శివసేన కార్యకర్తలు భగ్గుమన్నారు. ఆయనపై పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. నాసిక్‌లో కేంద్రమంత్రి నారాయణ్ రాణేపై ఎఫ్ఐఆర్ నమోదవడంతో అక్కడి పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసేందుకు బయలుదేరారు. ప్రస్తుతం జన ఆశీర్వాద్ యాత్రలో ఉన్న నారాయణ్ రాణే చిప్లున్ ప్రాంతంలో ఉండి ఉంటారని భావిస్తున్నారు. పోలీసులు అక్కడికే వెళ్లి ఆయన్ను అరెస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే రాష్ట్రంలో శివసేన,బీజేపీ శ్రేణుల మధ్య రచ్చ మరింత ముదురుతుంది. అది శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం లేకపోలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+