ప్రధాని గ్రేట్!: నరేంద్ర మోడీ సర్‌ప్రైజ్ అయ్యే ప్రశంసలు
ప్రధాని నరేంద్ర మోడీ పైన సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ప్రశంసలు కురిపించారు. మోడీ యోధుడు అని కీర్తించారు. ఉత్తర ప్రదేశ్‌లో త్వరలో ఎన్నికలు ఉన్నాయి.
లక్నో: ప్రధాని నరేంద్ర మోడీ పైన సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ప్రశంసలు కురిపించారు. మోడీ యోధుడు అని కీర్తించారు. ఉత్తర ప్రదేశ్‌లో త్వరలో ఎన్నికలు ఉన్నాయి.
ఇలాంటి సమయంలో నిత్యం తనను వ్యతిరేకించి ములాయం నుంచి మోడీకి ప్రశంసలు రావడం ఆశ్చర్యమని చెప్పవచ్చు. మోడీ నేపథ్యం చాలా వినయపూర్వకమైనదని బుధవారం నాడు కితాబిచ్చారు.
మరోవైపు యూపీలో సమాజ్ వాదీ పార్టీలో సమస్యలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మద్దతుదారులకు ములాయం టిక్కెట్లు కేటాయించలేదు. అయితే తన మద్దతుదారులతో రెబెల్‌గా బరిలోకి దిగాలని అఖిలేష్ భావిస్తున్నారట.

సమాజ్ వాదీ పార్టీలో అభ్యర్థుల జాబితాను బుధవారం ప్రకటించారు. అయితే 403 మందితో అఖిలేష్ పంపిన జాబితాలో పేర్లను పక్కకు పెట్టారు. అఖిలేష్ వ్యతిరేకులే జాబితాలో టిక్కెట్లు కేటాయించారు.
టిక్కెట్ల కేటాయింపులో శివపాల్ యాదవ్ చెప్పిన వ్యక్తులకే టిక్కెట్లను కేటాయించారు. ములాయం సింగ్ కూడ శివపాల్ చెప్పినట్టుగానే టిక్కెట్లు కేటాయించారు. అయితే ఈ టిక్కెట్ల కేటాయింపు జాబితాపై అఖిలేష్ గుర్రుగా ఉన్నారు.












Click it and Unblock the Notifications