వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నోబెల్: ఠాగూర్ నుంచి సత్యార్థి వరకు, మోడీ అభినందన

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: 2014 సంవత్సరానికి గానూ నోబెల్ శాంతి బహుమతి భారతీయుడైన బాలల హక్కుల కార్యకర్త కైలాస్ సత్యార్థికి వచ్చిన విషయం తెలిసిందే. ఈ బహుమతి అందుకున్న ఐదవ భారతీయుడిగా ఆయన రికార్డు సృష్టించారు. ఇప్పటి వరకు ఆరుగురు భారతీయులు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును సొంతం చేసుకున్నారు.

1913లో ప్రముఖ సాహితీవేత్త రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్యంలో నోబెల్ బహుమతి దక్కించుకున్నారు.
ఆయన తర్వాత
1930లో సర్ సివి రామన్ భౌతిక శాస్త్రంలో చేసిన పరిశోధనలకు గానూ నోబెల్ పురస్కారం అందకున్నారు.

1968లో వైద్యశాస్త్రంలో హర్ గోవింద్ ఖురానా నోబెల్ బహుమతి అందుకున్నారు.

1979లో మదర్ థెరిస్సా భారత్ తరపున నోబెల్ శాంతి బహుమతి పుచ్చుకున్నారు.

Narendra Modi hails Kailash Satyarthi, Malala Yousafzai for winning Nobel Peace Prize

1983లో సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్‌కు భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం లభించింది.

ఆ తర్వాత 2014లో బాలల హక్కుల కోసం నిరంతరం శ్రమించిన కౌలాస్ సత్యార్థిని ఈ ప్రతిష్ఠాత్మక బహుమతి వరించింది.

భారత్‌ తరపున కానప్పటికీ నోబెల్ బహుమతి అందుకున్న భారతీయులు..

భారత్‌లో పుట్టిన బ్రిటిష్ పౌరుడు రోనాల్డ్ రాస్. రుడ్ యార్డ్ కిప్లింగ్

వెంకట్రామన్ రామకృష్ణన్‌కు 2009లో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది.

ట్రినిడాడ్‌లో పుట్టి బ్రిటన్‌లో స్థిరపడిన భారత సంతతి వ్యక్తి విఎస్ నైపాల్

భారత్‌లో పుట్టిన పాకిస్థాన్ పౌరుడు అబ్దున్ సలాం (నోబెల్ శాంతి)

టిబెట్‌లో పుట్టి భారత్‌లో నివసిస్తున్న దలైలామా (నోబెల్ శాంతి)

భారత్‌లో పుట్టిన బంగ్లాదేశ్ పౌరుడు మహ్మద్ యునన్‌

వీరితోపాటు ఐపిసిసి పేరిట భారతీయుడు రాజేంద్రకుమార్ పచౌరి నిర్వహిస్తున్న ఛారిటీ సంస్థ కూడా నోబెల్ బహుమతి గెలుచుకుంది.

కాగా, భారత ప్రధాని నరేంద్ర మోడీ నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్న కైలాస్ సత్యార్థి, పాకిస్థాన్‌కు చెందిన మాలాలా యుసుఫ్ జాయ్‌కి అభినందనలు తెలిపారు. బాలల హక్కుల కోసం అవిశ్రాంతంగా శ్రమించారని మోడీ.. కైలాస్ సత్యార్థిని కొనియాడారు. ఇది ఇలా ఉండగా నోబెల్ బహుమతి గ్రహీత సత్యార్థి మోడీని మర్యాద పూర్వకంగా కలువనున్నారు.

English summary
Prime Minister Narendra Modi today congratulated child rights activist Kailash Satyarthi and Pakistani girls education rights activist Malala Yousafzai on being chosen for the the Nobel Peace Prize.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X