అందమైన వ్యక్తి: మోడీపై సైఫ్ అలీఖాన్, వివేక్‌కి ప్రశంస
ముంబై/న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలా అందమైన, ఆకర్షణీయమైన వ్యక్తి అని ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పేర్కొన్నారు. ఇటీవల ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో భార్య కరీనాకపూర్‌తో కలిసి సైఫ్ అలీఖాన్ ప్రధాని మోడీని కలిశారు. ఈ సందర్భంగా మోడీతో సైఫ్ ఓ సెల్ఫీ ఫొటో కూడా తీసుకున్నారు.
సైఫ్ అలీఖాన్ మాట్లాడుతూ.. ప్రధాని చాలా అందమైన, ఆకర్షణీయమైన వ్యక్తి అని అప్పుడే గుర్తించినట్లు చెప్పారు. ఆయన్ను కలవడం చాలా అద్భుతంగా అనిపించిందని అన్నారు. మోడీ చాలా సహజమైన వ్యక్తని, చాలా దయగల వారని, మర్యాదస్తులని సైఫ్ చెప్పారు.
కార్యక్రమంలో మోడీ చాలా గొప్పగా ప్రసంగించారని తెలిపారు. ఆయనకు తాను 100శాతం మద్దతు పలుకుతామని చెప్పారు. తాను ఎక్కువగా సోషల్ మీడియాను ఉపయోగించనని, ట్విట్టర్ ఖాతా కూడా ఇప్పటి వరకు తెరవలేదని సైఫ్ అలీఖాన్ తెలిపారు.

వివేక్ ఒబెరాయ్‌కి ప్రధాని అభినందనలు
న్యూఢిల్లీ: ‘స్వచ్ఛ భారత్' కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని పరిసరాలను శుభ్రం చేసిన బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్‌కి ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. ‘స్వచ్ఛ భారత్ కోసం వివేక్ ఒబెరాయ్ శ్రమను అభినందిస్తున్నా' అని మోడీ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ వివేక్ ఒబెరాయ్ ముంబైలో చీపురు పట్టి వీధులను శుభ్రం చేశారు. ఇప్పటికే పలువురు బాలీవుడ్ నటులు, ప్రముఖులు స్వచ్ఛ భారత్‌లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి ప్రధాని మోడీ అభినందనలు తెలియజేస్తున్నారు.
అమితాబ్, నాగార్జున, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, హృతిక్ రోషన్, అనుపమ్ ఖేర్ లాంటి ప్రముఖ నటులు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొని తమ అభిమానులకు, ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications