వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ, కవితలు సామాజిక, జేసీ రైతు: ఎంపీల వృత్తులు..

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ ఎంపీ కల్వకుంట్ల కవిత, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎంపీ బుట్టా రేణుక తదితరులు తమను తాము సామాజిక కార్యకర్తగా చెప్పుకున్నారు.

ప్రస్తుత 16వ లోకసభలో 539 మంది ఎంపీలు ఉన్నారు. వీరులో వారు వారు చేస్తున్న పనులను చెప్పారు. 151 మంది వ్యవసాయం తమ వృత్తిగా చెప్పారు.

సామాజిక సేవకులుగా నరేంద్ర మోడీ సహా 87 మంది, వ్యాపారస్తులమని 72 మంది ఎంపీలు చెప్పారు. న్యాయవాద వృత్తిలో ఉన్నట్లు 54 మంది, వైద్యులమని 21 మంది చెప్పుకున్నారు. 16 మంది ఎంపీలు తమది సినీరంగమని చెప్పారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ 1988లో రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటి వరకు ఆరెస్సెస్‌లో పని చేశారు. ఇప్పుడు ఆయన ప్రధాని. తనకు తాను సామాజిక కార్యకర్తగా ఆయన చెప్పుకున్నారు.

కల్వకుంట్ల కవిత

కల్వకుంట్ల కవిత

సామాజిక కార్యకర్తగా చెప్పుకున్న వారిలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుండి కల్వకుంట్ల కవిత, నంది ఎల్లయ్య, కంభంపాటి హరిబాబు, బుట్టా రేణుక తదితరులు ఉన్నారు.

బుట్టా రేణుక

బుట్టా రేణుక

సామాజిక కార్యకర్తగా చెప్పుకున్న వారిలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుండి కల్వకుంట్ల కవిత, నంది ఎల్లయ్య, కంభంపాటి హరిబాబు, బుట్టా రేణుక తదితరులు ఉన్నారు.

అద్వానీ, రాజ్‌నాథ్ సింగ్

అద్వానీ, రాజ్‌నాథ్ సింగ్

బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ తాను విలేకరినని చెప్పగా, రాజ్ నాథ్ సింగ్ తాను ఉపాధ్యాయుడినని చెప్పారు. ఎక్కువ శాతం మంది వ్యవసాయరంగంలో ఉన్నట్లు వెల్లడించారు. విలేకరి వృత్తిలో ఉన్నామని చెప్పిన వారు అద్వానీ సహా నలుగురు ఉన్నారు.

జేసీ దివాకర్ రెడ్డి

జేసీ దివాకర్ రెడ్డి

జేసీ దివాకర్ రెడ్డి, నిమ్మల కిష్టప్ప, మల్లికార్జున ఖర్గే తదితరులు తాము వ్యవసాయ రంగంలో ఉన్నట్లు చెప్పారు. మొత్తం 151 మంది ఎంపీలు వ్యవసాయమే తమ వృత్తిగా వెల్లడించారు.

బండారు దత్తాత్రేయ

బండారు దత్తాత్రేయ

బండారు దత్తాత్రేయ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీహెచ్ మల్లా రెడ్డి, జితేందర్ రెడ్డి, కొత్తపల్లి గీత, వైవీ సుబ్బారెడ్డి, కెప్టెన్ అమరీందర్ సింగ్ తదితరులు వ్యాపార వృత్తిలో ఉన్నట్లు చెప్పారు.

కొత్తపల్లి గీత

కొత్తపల్లి గీత

కొత్తపల్లి గీత, బండారు దత్తాత్రేయ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీహెచ్ మల్లా రెడ్డి, జితేందర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, కెప్టెన్ అమరీందర్ సింగ్ తదితరులు వ్యాపార వృత్తిలో ఉన్నట్లు చెప్పారు.

సుష్మా స్వరాజ్

సుష్మా స్వరాజ్

సుష్మా స్వరాజ్, సుమిత్రా మహాజన్, సదానంద గౌడ, వీరప్ప మొయిలీ, అసదుద్దీన్ ఓవైసీ, వినోద్ కుమార్ తదితరులు న్యాయవాద వృత్తిలో ఉన్నట్లు చెప్పారు.

సోనియా గాంధీ, మేనకా గాంధీ

సోనియా గాంధీ, మేనకా గాంధీ

ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తన నృత్తిని రాజకీయాలు, సామాజిక సేవగా చెప్పారు. ఈ వృత్తిలో 35 మంది ఎంపీలు ఉన్నట్లు చెప్పారు. మేనకా గాంధీ తాను రచయితనని చెప్పారు.

హేమమాలిని

హేమమాలిని

హేమమాలని, మురళీ మోహన్, పరేశ్ రావల్, మున్ మున్ సేన్ సినిమా రంగంలో ఉన్నట్లు చెప్పారు. సినిమా రంగంలో ఉన్నట్లు చెప్పిన వారు 16 మంది ఉన్నారు. రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, వికే సింగ్ రక్షణ రంగంలో ఉన్నామని చెప్పారు.

మురళీ మోహన్

మురళీ మోహన్

రాజమండ్రి ఎంపీ మురళీ మోహన్ సినిమా రంగంలో ఉన్నట్లు చెప్పారు. రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, వికే సింగ్ రక్షణ రంగంలో ఉన్నామని చెప్పారు.

బాల్క సుమన్

బాల్క సుమన్

అశోక గజపతి రాజు, సీతారాం నాయక్, బాల్క సుమన్, కడియం శ్రీహరి తదితరులు తమ వృత్తిని చెప్పలేదు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాపారమని చెప్పారు.

రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ

ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ కన్సల్టెంట్‌గా పేర్కొన్నారు. అదిలాబాద్ ఎంపీ నగేష్ రైతుగా, భువనగిరి ఎంపీ నర్సయ్య గౌడ్ వైద్యుడిగా, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి ఇంజనీర్‌గా పేర్కొన్నారు.

English summary
PM Narendra Modi and MP Kavitha are social activists.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X