వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గూగుల్ సెర్చ్: నెంబర్ వన్ నరేంద్రమోడీ, టెన్ దిగ్విజయ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Narendra Modi
న్యూఢిల్లీ: ఈ ఏడాది మార్చి నుంచి ఆగస్టు నెల వరకు గూగుల్ సెర్చ్ ఇంజన్‌లో అత్యధిక మంది భారతీయులు గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ కోసం వెదికారు. 1 మార్చి 2013 నుండి 31 ఆగస్టు 2013 వరకు భారతీయులు వెదికిన టాప్ టెన్ లిస్టులో మోడీ మొదటి స్థానంలో ఉన్నారు.

ఆ తర్వాత స్థానాల్లో ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, అమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, బిజెపి అగ్రనేత సుష్మా స్వరాజ్, ఎఐసిసి అధికార ప్రతినిధి, ఏపి స్టేట్ ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్‌లు ఉన్నారు.

అత్యధికంగా వెతికిన పార్టీలలో భారతీయ జనతా పార్టీ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా కాంగ్రెసు, ఆమ్మ ఆద్మీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, శివసేనాలు ఉన్నాయి.

94 శాతం మంది పట్టణ ఓటర్లు తాము 2014 ఓటు వేస్తామని చెప్పారు. అందులో 42 శాతం మంది ఎవరికి ఓటు వేయాలో ఇంకా నిర్ణయించుకోలేదు. తమ ఓటింగ్ విషయంలో ప్రధానమంత్రి అభ్యర్థి ప్రభావం చూపుతారని 11 శాతం మంది చెప్పారు. పార్టీని చూసి ఓటు వేస్తామని 35 శాతం మంది చెప్పగా, స్థానిక అభ్యర్థుల ఆధారంగా ఓటేస్తామని 36 శాతం మంది చెప్పారు.

English summary
The BJP's Prime Ministerial candidate is followed by Rahul Gandhi, Sonia Gandhi, Manmohan Singh and anti-corruption campaigner, Arvind Kejriwal, who debuts in the November Delhi assembly polls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X