చంగేచెన్ నది ఒడ్డున మోడీ, పారిశ్రామిక వేత్తలతో భేటీ(ఫోటోలు)
న్యూఢిల్లీ: రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్రమోడీ దక్షిణ కొరియా రాజధాని సియోల్ మధ్యలో ప్రవహించే చంగేచెన్ నది పరిసర ప్రాంతాలను పరిశీలించారు. డౌన్ టౌన్ ఉన్న ఆ ప్రాంతాన్ని మోడీ కలియతిరిగి చంగేచెన్ నది వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అక్కడున్న అధికారులు నది ప్రక్షాళన వివరాలను ప్రధాని మోడికి వెల్లడించారు. గతంలో కాలుష్యంతో నిండిపోయిన చంగేచెన్ నదిలో ప్రక్షాళన చేపట్టారు. ఆ తర్వాత కాలంలో అది మంచినీటి నదిగా మారింది. అంతే కాదు నది చుట్టూ ఆకాశహర్మ్యాలు, పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్‌లను ఏర్పాటు చేశారు.
భారత్‌కు పయనమైన ప్రధాని మోడీ
మూడు దేశాల పర్యటనను ముగించుకుని భారత ప్రధాని నరేందమోడీ మంగళవారం స్వదేశానికి పయనమయ్యారు. దక్షిణకొరియా రాజధాని సియోల్‌లో నుంచి ప్రత్యేక విమానంలో రాజధాని ఢిల్లీకి బయలుదేరారు. ఈ సందర్భంగా దక్షిణ కొరియా అధికారులు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. విదేశీ పర్యనటలో భాగంగా చైనా, మంగోలియా, దక్షిణకొరియాలలో మోడీ పర్యటించిన సంగతి తెలిసిందే.

చంగేచెన్ నది ఒడ్డున మోడీ
రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్రమోడీ దక్షిణ కొరియా రాజధాని సియోల్ మధ్యలో ప్రవహించే చంగేచెన్ నది పరిసర ప్రాంతాలను పరిశీలించారు.

చంగేచెన్ నది ఒడ్డున మోడీ
డౌన్ టౌన్ ఉన్న ఆ ప్రాంతాన్ని మోడీ కలియతిరిగి చంగేచెన్ నది వివరాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడున్న అధికారులు నది ప్రక్షాళన వివరాలను ప్రధాని మోడికి వెల్లడించారు.

చంగేచెన్ నది ఒడ్డున మోడీ
గతంలో కాలుష్యంతో నిండిపోయిన చంగేచెన్ నదిలో ప్రక్షాళన చేపట్టారు. ఆ తర్వాత కాలంలో అది మంచినీటి నదిగా మారింది. అంతే కాదు నది చుట్టూ ఆకాశహర్మ్యాలు, పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్‌లను ఏర్పాటు చేశారు.

చంగేచెన్ నది ఒడ్డున మోడీ
చెంగేచెన్ నది వద్దకు వచ్చిన ప్రధాని మోడీని తిలకించేందుకు ఎన్నారైలు కూడా ఎగబడ్డారు. ఆయన్ను కలుసుకునేందుకు పోటీపడ్డారు. ప్రధాని మోడీ ఎన్నారైలకు అభివాదం చేశారు. ఆ తరువాత 6వ ఏషియన్ లీడర్‌షిప్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

పారిశ్రామిక వేత్తలతో ప్రధాని మోడీ భేటీ
సియోల్‌లో దక్షిణ కొరియా పారిశ్రామిక వేత్తలతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్‌కు పెట్టుబడులతో తరలిరావాలని పిలుపునిచ్చారు. కొరియా ప్రపంచానికి అనేక రంగాల్లో నాణ్యమైన సేవలందిస్తోందని అభినందించారు.

పారిశ్రామిక వేత్తలతో ప్రధాని మోడీ భేటీ
ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్ వంటి రంగాల్లో కొరియా ప్రపంచానికి అద్భుతమైన ఉత్పత్తులు అందించిందని, కొరియా సంస్థలు నిర్మాణ రంగంలోనూ ముందున్నాయని ఆయన పేర్కొన్నారు. భవనాలు, స్మారక నిర్మాణాల్లోనూ కొరియాది ప్రత్యేకతేనన్నారు.

పారిశ్రామిక వేత్తలతో ప్రధాని మోడీ భేటీ
ఓ భారతీయుడిగా దక్షిణ కొరియా విజయాలు సాధించిన రంగాల్లో భారత్‌లోనూ చక్కని ఫలితాలు సాధించాలని కోరుకుంటున్నానన్న ఆయన, భారత్‌లోని అవకాశాలను అందిపుచ్చుకోవాలని అక్కడి పారిశ్రామికవేత్తలకు సూచించారు.

పారిశ్రామిక వేత్తలతో ప్రధాని మోడీ భేటీ
సామ్‌సంగ్, ఎల్‌జీ, హుండాయి లాంటి కంపెనీ సీఈవోలతో ప్రధాని మోడీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ కంపెనీలన్నీ భారత్‌లో తమ తమ ప్లాంట్లను నిర్వహిస్తున్నాయి. కార్లు, స్మార్ట్‌ఫోన్ల తయారీలో కొరియా కంపెనీలకు భారత్‌లో ఎక్కువ ఆధరణ ఉంది.
పారిశ్రామిక వేత్తలతో ప్రధాని మోడీ భేటీ
హుందై కార్ల కంపెనీకి చెందిన రెండు ప్లాంట్లు చెన్నైలో ఉన్నాయి. ఈ భేటీ అనంతరం ఆ కంపెనీ మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. మొబైల్ రంగంలో దూసుకుపోతున్న శాంసంగ్ కంపెనీ సీఈఓను కూడా మోడీ కలుసుకున్నారు. భారత్‌లో మూడో ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు శాంసంగ్ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications