అప్పుడు పాకిస్తానీలను కాపాడిన ఇండియన్ ఆర్మీ: మోడీ
భోపాల్: జమ్ము కాశ్మీర్‌ను వరదలు ముంచెత్తినప్పుడు ఆర్మీ రంగంలోకి దిగి ప్రజలను కాపాడిందని, ఎవరైతే రోజు తమ మీద రాళ్లు విసురుతారో, అలాంటి వారినే కొందరిని తమ భుజాలపై మోస్తూ సురక్షిత ప్రాంతాలకు తరలించిందని, ఈ ఏడాది ప్రారంభంలో యెమెన్‌లో అంతర్యుద్ధం వచ్చినప్పుడు అక్కడ చిక్కుకున్న భారతీయులతో పాటు పాకిస్తానీలను కూడా మన సైన్యం కాపాడిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
యుద్ధంలో అమరవీరులైన సైనికుల స్మృత్యార్థం దేశంలోనే మొట్టమొదటిసారిగా భోపాల్‌లో నిర్మించిన అమరవీరుల స్మారక కేంద్రం (శౌర్య స్మారక్)ను శుక్రవారం మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. మన సైన్యం మాట్లాడదని, కానీ పరాక్రమం చూపుతుందన్నారు.

సైనికుల త్యాగం వల్లే ప్రజలు సుఖంగా జీవిస్తున్నారన్నారు. దేశ రక్షణ కోసం జవానులు ప్రాణత్యాగం చేస్తున్నారన్నారు. క్రమశిక్షణ, వ్యవహార శైలిలో మన సైన్యానికి ప్రపంచస్థాయిలో గుర్తింపు ఉందన్నారు. యెమెన్‌లో చిక్కుకున్న అయిదు వేల మంది భారతీయులతో పాటు పాక్, ఇతర దేశాలకు చెందిన వారిని మన సైన్యం రక్షించిందని గుర్తు చేశారు.
ఐక్య రాజ్య సమితి శాంతి దళాల్లో భారత్ సుదీర్ఘ కాలంగా సేవలందిస్తోందన్నారు. దేశ ప్రజలు ప్రశాంతంగా నిద్రపోవడం కోసం సైనికులు తమ జీవితాలనే త్యాగం చేస్తున్నారన్నారు. ఆధునిక ఆయుధాలతోనే సైన్యం విజయం సాధిస్తుందనుకుంటే అది భ్రమేనని, విజయానికి కావాల్సింది మనోబలమన్నారు.
సైన్యం మాదిరిగానే రక్షణ మంత్రి కూడా మాట్లాడారని, చేతల్లో చూపుతారని చెప్పారని అన్నారు. ప్రజలు హాయిగా నిద్రపోతే సైన్యం ఆనందిస్తుందని, కానీ మేల్కొనాల్సిన సమయంలో కూడా నిద్రపోతే సైన్యం క్షమించదన్నారు. కొద్ది రోజుల క్రితం వరకు కొందరు మోడీ నిద్రపోతున్నారు.. ఏం చేయలేకపోతున్నారని అంటే తనకు ఉక్రోశంగా అనిపించేదన్నారు.
సర్జికల్ స్ట్రయిక్ దాడుల అనంతరం వారి నోళ్లన్నీ మూతబడ్డాయన్నారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అమలు చేసి మాజీ సైనికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్పారు. సైనికుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.












Click it and Unblock the Notifications