పోలింగ్ డే: కన్నడ ఓటర్లకు మోడీ, రాహుల్ పిలుపు

Recommended Video

    Karnataka Election 2018 Update

    బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై యావత్ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. శనివారం ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా, ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కర్ణాటక ప్రజలకు విధిగా ఓటు వేయాలని కోరారు.

     Narendra Modi and Rahul Gandhi on Karnataka polls

    కర్ణాటక ప్రజలు పెద్ద ఎత్తన పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ప్రస్తుతం నేపాల్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ ట్విట్టర్ వేదిక కర్ణాటక ఎన్నికలపై స్పందించారు.

    'కర్ణాటక సోదరసోదరీమణులను నేను కోరేది ఒక్కటే. నేటి పోలింగ్‌లో పెద్ద సంఖ్యలో ఓటింగ్ నమోదవ్వాలి. ముఖ్యంగా యువ ఓటర్లు ముందుకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటేసి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలి' అని ప్రధాని మోడీ కన్నడ ప్రజలను కోరారు.

    కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. 'ఎన్నికల్లో నమోదైన ఓటింగ్ శాతం క్రియాశీల ప్రజాస్వామ్యానికి నిదర్శనం. కర్ణాటక ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొని ఈ ప్రజాస్వామ్య పండగను మరింత రెట్టింపు చేయాలి. ఈ ఎన్నికల్లో తొలిసారిగా ఓటు వేయబోతున్న యువ స్నేహితులకు సాదర స్వాగతం' అని కన్నడలో ట్వీట్ చేయడం గమనార్హం.

    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్, బీజేపీలు నిన్నటి వరకు విస్తృత ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. తామే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటే తామే ఏర్పాటు చేస్తామంటూ ఇరు పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేశారు. ఇక జేడీఎస్ కూడా తాము కింగ్ మేకర్ కాదు కింగేనంటూ స్పష్టం చేసింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+