బెంగళూరులో నరేంద్ర మోడి బహిరంగ సభ

బెంగళూరు: బెంగళూరు నగరంలోని నేషనల్ కాలేజ్ మైదానంలో బీజేపీ బహిరంగ సభ కు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. బహిరంగ సభలో పాల్గోనడానికి బయలుదేరిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కారు ట్రాఫిక్ సిగ్నల్ లో చిక్కుకు పోయింది. పోలీసులు నానా తంటాలు పడి అమిత్ షా సభా వేదిక దగ్గరకు వెళ్లడానికి వీలు కల్పించారు.

వివిద రాష్ట్రాల నుండి తరలి వచ్చిన బీజేపీ నాయకులు సభలో పాల్గోనడానికి బీఎంటీసీ వజ్ర వోల్వో బస్సులలో బయలుదేరి వెళ్టారు. నేషనల్ కాలేజ్ మైదానంలో ఎక్కడ చూసిన పోలీసులు దర్శనం ఇచ్చారు. వేలాధిమంది పోలీసు అధికారులు, సిబ్బంది భద్రతా ఏర్పాట్లలో నిమగ్నం అయ్యారు.

narendra modi rally in bengaluru april 3 highlights

సమయం 7.30: గతంలో రైల్వే బడ్జెట్ ఎలా ఉండేది తెలుసా అన్నారు. పార్లమెంట్ సభ్యులు రైల్వే స్టే షన్ లు పరిశీలించి అక్కడ ఎలాంటి సౌకర్యాలు సవసరం ఉన్నాయి అని గుర్తించి కేంద్ర ప్రభుత్వానికి లేఖలు వ్రాసేవారని అన్నారు. ఆ లేఖలు పరిశీలించి రైల్వే బడ్జెట్ తయారు చేసే వారని గుర్తు చేశారు. అయితే తాము 10 సంవత్సరాలు రైల్వే శాఖకు ఎలాంటి ఇబ్బంది కలగకుండ జాగ్రతలు తీసుకున్నామని, కార్మికుల రక్షణకు ప్రాధాన్యత ఇచ్చామని వివరించారు.

సమయం 7.15: అనేక శాఖలలో 2007 నుండి 2014 వరకు అనేక ఫైల్స్ దుమ్ము పట్టి మూలుగుతున్నాయని అన్నారు. ఆ ఫైల్స్ మీరు ఎందుకు పరిశీలించలేదని తాను అధికారులను నిలదీశానని అన్నారు. 7 సంవత్సరాల పాటు అనేక ఫైల్ ల పరిష్కారం కాకపోతే దేశం ఎలా ముందుకు వెలుతుందని ప్రశ్నించారు. అన్ని తప్పులు సరిదిద్ది భారత దేశాన్ని వేగంగా అభివృద్ది చేస్తామని హామి ఇచ్చారు.

సమయం 7.10: ప్రస్తుతం అధికారంలో ఉన్న మా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తున్నదని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజల అవసరాలను గుర్తించి ఆదుకుంటున్నామని అన్నారు. గతంలో రాష్ర్ట ప్రభుత్వాలు మాకు ఇంత నిధులు కావాలి అని కేంద్ర ప్రభుత్వానికి మనవి చేసేవారని చెప్పారు. ఇప్పుడు పరిస్థితి అలా లేదని అన్నారు. ఢిల్లీలో ఉన్న మా కేంద్ర ప్రభుత్వానికి భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు సమానమే అని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి దేశాన్ని అభివృద్ది చేస్తామని అన్నారు.

సమయం 7.07: బెంగళూరు ఐటి కంపెనీలకు ప్రసిద్ది చెందింది. ప్రపంచంలోనే బెంగళూరుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. డిజిటల్ ఇండియా ద్వారా తాము దేశాన్ని ఎలా అభివృద్ది చేసి ముందుకు తీసుకు వెలుతాం అని చేసి చూపిస్తామని ప్రతిపక్షాలకు సవాలు విసిరారు. మొబైల్ సేవల ద్వార ప్రజలకు ప్రభుత్వ సేవలు అందిస్తే అవినీతి జరగడానికి ఎక్కడా ఆస్కారం ఉండదని చెప్పారు.

సమయం 7.00: భారతదేశంలో జనాభా కంటే మొబైల్ ఫోన్లు ఎక్కువగా ఉన్నాయి. అందుకే మొబైల్ పరిపాలన అమలు చెయ్యాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ప్రతి పక్షాలు పదేపదే బ్లాక్ మని ఎందుకు భారత్ కు తీసుకురాలేదని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. అసలు బ్లాక్ మని ఎక్కడి నుండి వచ్చింది. మీ హయాంలోనే బ్లాక్ మని విదేశాలకు తరలి వెళ్లిందని గుర్తు చేశారు. బ్లాక్ మని భారత్ కు తీసుకురావడానికి విదేశాలతో సంప్రదింపులు చేస్తున్నామని గుర్తు చేశారు.

సమయం 6.55: అవినీతిపై పోరాటం చేసి తాము కేంద్రంలో అధికారంలోకి వచ్చామని గుర్తు చేశారు. భారతదేశంఅభివృద్ది మాకు ముఖ్యం. అంతే కాని అధికారం కాదు. అందుకే ప్రజలకు మేలు కలిగే నిర్ణాయాలు తీసుకుంటున్నాం. ఎలాంటి పరిస్థితిలో అవినీతి జరగడానికి అస్కారం ఇవ్వమని కుండలు బద్దలుకోట్టి చెప్పారు.

సమయం 6.48: గతంలో ప్రతి రోజు పత్రికలు, టీవీలలో కుంబకోణాలు, స్కాంలు చేశారని వార్తలు వచ్చేవని గుర్తు చేశారు. మేము అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు సేవ చెయ్యాలని ఆలోచించి తప్పుడు నిర్ణాయాలు తీసుకోలేదని అన్నారు. ఎప్పటికప్పుడు మంత్రులు, అధికారులతో చర్చించి ఎక్కడ అవినీతికి చోటు ఇవ్వకుండ నిర్ణయాలు తీసుకుంటున్నాం అని చెప్పారు.

narendra modi rally in bengaluru april 3 highlights

సమయం 6.45: సభను ఉద్దే శించి భారత ప్రధాని నరేంద్ర మోడి మాట్లాడారు. భారతదేశం అన్ని రంగాలలో ముందుకు దూసుకు వెలుతున్నదని చెప్పారు కేంద్రంలో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు అయ్యిందని అన్నారు. మా పరి పాలనలో ప్రజకు మేలు చేశామని అన్నారు.

సమయం 6.22: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సభకు హాజరైన వారిని ఉద్దేశించి మాట్లాడారు. దేశ ప్రజలు ఆలోచించి బీజేపీ అధికారంలోకి రావడానికి చక్కటి అవకాశం కల్పించారని అన్నారు. ఈ సందర్బంలో ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మేము ప్రజల నమ్మకాన్నికాపాడుతాం అని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+