గాంధీకి అవమానం జరిగిన స్టేషన్‌లో ప్రధాని మోడీ

Posted By:
Subscribe to Oneindia Telugu

డర్బన్: ఆఫ్రికా దేశాల పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ గుర్తుపెట్టుకునే చారిత్రాత్మక రైలు ప్రయాణాన్ని చేశారు. జాతిపిత మహాత్మాగాంధీని అవమానించిన రైల్వే స్టేషన్ వరకు ప్రధాని మోడీ ప్రయాణించారు. దక్షిణాఫ్రికా ప్రధాని, ఇతర అధికారులు వెంటరాగా ప్రధాని మోడీ శనివారం పెంట్రిచ్‌ రైల్వేస్టేషన్‌ నుంచి పీటర్‌ మ్యారిట్జ్‌బర్గ్‌ వరకు రైలులో ప్రయాణించారు.

1893లో సరిగ్గా ఇక్కడే మహాత్మా గాంధీని తెల్లవారు రైలు నుంచి కిందకు తోసేసింది ఈ స్టేషన్‌లోనే కావడంతో ఈ స్టేషన్‌కు అంత ప్రాముఖ్యత సంతరించుకుంది. ఫస్ట్‌క్లాస్ టికెట్ తీసుకుని రైలు ప్రయాణిస్తున్న గాంధీని జాతి వివక్ష కారణంగా అక్కడి తెల్లవారు రైలు నుంచి తోసేశారు.

ఆ తర్వాతే గాంధీజీ దక్షిణాఫ్రికాలో నల్లవారి హక్కుల కోసం పోరాడారు. జాతి వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమించారు. అక్కడ నుంచి భారత్‌కు వచ్చి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారత స్వాతంత్ర్యం కోసం శాంతియుత పోరాటం చేశారు. ఇంత చారిత్రక చోటు కావడంతో ప్రధాని ఈ రైల్వే స్టేషన్‌కు చేరుకుని గాంధీజీకి నివాళులర్పించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Prime Minister Narendra Modi on Friday night arrived in Durban from Johannesburg for the second day of his engagements in South Africa.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి