అనుచిత వ్యాఖ్యలు: నిన్న జయప్రదపై ఆజంఖాన్, నేడు జయబచ్చన్‌పై నరేష్ అగర్వాల్

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఆడి పాడే నాట్యకత్తె అంటూ మాజీ పార్లమెంటు సభ్యురాలు జయప్రదపై ఎస్పీ నేత ఆజంఖాన్ చేసిన వ్యాఖ్యలను మరిచిపోక ముందే పార్లమెంటు సభ్యురాలు జయా బచ్చన్‌పై బిజెపి నేత నరేష్ అగర్వాల్ అనుచిత వ్యాఖ్యలు చేశారు.

చదవండి: అఖిలేష్‌కు షాక్: బీజేపీలోకి నరేష్, గతంలోను వివాదాస్పద వ్యాఖ్యలు

సమాజ్‌వాదీ పార్టీకి గుడ్‌బై చెప్పి బిజెపిలో చేరిన మరుక్షణమే ఆయన సోమవారం సినీనటి, రాజ్యసభ సభ్యురాలు అయిన జయబచ్చన్‌పై ఫిల్మీవాలీ అంటూ వ్యాఖ్యలు చేశారు.

 ఇలా వ్యాఖ్య చేశారు..

ఇలా వ్యాఖ్య చేశారు..

ఓ సినీ నటితో సమానంగా తనను చూశారని, తన టికెట్ ఆమెకు ఇచ్చారని, బిజెపిలో చేరడానికి తాను ఏ విధమైన షరతులూ పెట్టలేదని, రాజ్యసభ టికెట్ తనకు అవసరం లేదని నరేష్ అగర్వాల్ అన్నారు. కేంద్ర మంత్రి పియూష్ గోయల్ సమక్షంలో నరేష్ అగర్వాల్ బిజెపిలో చేరారు.

 అఖిలేష్‌పై అగర్వాల్ అసంతృప్తి

అఖిలేష్‌పై అగర్వాల్ అసంతృప్తి

నరేష్ అగర్వాల్ సమాజ్‌వాదీ ప్రధాన కార్యదర్శిగానూ రాజ్యసభ సభ్యుడిగానూ ఉంటూ వచ్చారు. రాజ్యసభ టికెట్ జయాబచ్చన్‌కు ఇవ్వడంపై ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌పై ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

 అమర్ సింగ్ ఇలా చెప్పారు...

అమర్ సింగ్ ఇలా చెప్పారు...

ఉత్తరప్రదేశ్ నుంచి జరిగే రాజ్యసభ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిగా జయా బచ్చన్‌ను ఎస్పీ నిర్ణయించింది. జయాబచ్చన్ పార్టీకి విధేయురాలని, ఆమెకు రాజ్యసభ టికెట్ ఇవ్వడం న్యాయమని రాజ్యసభ ఎంపీ అమర్ సింగ్ అన్నారు. తనకు టికెట్ ఇవ్వకుండా జయా బచ్చన్‌కు ఇవ్వడంపై నరేష్ అగర్వాల్ ఆగ్రహంతో ఉన్నారు.

ఎన్నో పార్టీలు మారారు..

ఎన్నో పార్టీలు మారారు..

నరేష్ అగర్వాల్ ఎన్నో పార్టీలు మారారు. తన రాజకీయ జీవితాన్ని ఆయన కాంగ్రెసుతో ప్రారంభించారని, రాజ్‌నాథ్ సింగ్ మంత్రివర్గంలో కూడా పనిచేశారని, ఆ తర్వాత బహుజన సమాజ్ పార్టీలో చేరారని, ఆ తర్వాత ఎస్పీలో చేరారని అమర్ సింగ్ అన్నారు.

అగర్వాల్ కన్నా బెటర్

అగర్వాల్ కన్నా బెటర్

నరేష్ అగర్వాల్ కన్నా జయబచ్చన్ ఉత్తమమైన రాజకీయ నేత అని అమర్ సింగ్ అన్నారు. జయ ఎల్లవేళలా పార్టీకి, వార్టీ విధానాలకు విధేయంగా ఉన్నారని అమర్ సింగ్ అన్నారు. మూడు విడతలు ఎంపీగా పనిచేశారు.

సుష్మా స్వరాజ్ ఖండన

సుష్మా స్వరాజ్ ఖండన

నరేష్ అగర్వాల్ బిజెపిలో చేరారని, ఆయనను స్వాగతిస్తున్నానని, అయితే జయా బచ్చన్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని, అంగీకారయోగ్యమైనవి కావని కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ అన్నారు. తన వ్యాఖ్యలను ఆమె ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Shortly after joining the BJP, Naresh Agrawal on Monday hit out at actor-turned-politician Jaya Bachchan for getting a ticket for the upcoming Rajya Sabha elections.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి