నాసిక్ కరెన్సీ నోట్ ప్రెస్ 5 రోజుల షట్ డౌన్... 40 మంది సిబ్బందికి కరోనా సోకడంతో...
మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న కరెన్సీ నోట్ ప్రెస్(CNP),ఇండియన్ సెక్యూరిటీ ప్రెస్(ISP)ను ఐదు రోజుల పాటు మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. వీటిల్లో పనిచేస్తున్న 40 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కరోనా బారినపడ్డవారిలో కొంతమంది అధికారులతో పాటు టెక్నికల్ మెయింటెనెన్స్ టీమ్ కూడా ఉన్నారు. ఈ రెండు యూనిట్లలో కలిపి ఇప్పటివరకూ మొత్తం 125 మంది కరోనా బారినపడినట్లు సమాచారం.
తాజా నిర్ణయంతో ఆదివారం(అగస్టు 30) నుంచి గురువారం(సెప్టెంబర్ 3) వరకు కరెన్సీ నోట్ ప్రెస్ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. దీంతో దాదాపు 68 మిలియన్ల నోట్ల ముద్రణలు నిలిచిపోనున్నాయి.
గురువారం తర్వాత ఈ రెండు ప్రెస్‌లలోని ఉద్యోగులందరికీ యాంటీజెన్ కరోనా పరీక్షలు చేస్తామని నాసిక్ మున్సిపల్ కార్పోరేషన్ ప్రకటించింది.

Recommended Video
కాగా,అంతకుముందు కరోనా లాక్ డౌన్ పీరియడ్‌లోనూ మూడుసార్లు కరెన్సీ నోట్ ప్రెస్ మూతపడింది. దేశంలోని 4 ప్రభుత్వ కరెన్సీ ముద్రణ కేంద్రాల్లో నాసిక్ కూడా ఒకటి. హైక్వాలిటీ బ్యాంకు నోట్లను ఇక్కడ ముద్రిస్తారు. భారత్‌లో చలామణిలో ఉన్న కరెన్సీలో దాదాపు 40శాతం నాసిక్ కరెన్సీ నోట్ ప్రెస్‌తో పాటు దాని దేవాస్‌లోని దాని అనుబంధ బ్యాంక్ నోట్ ప్రెస్‌లో ముద్రించబడినవే కావడం విశేషం. కరెన్సీ నోట్ ప్రెస్‌లో 2300 మంది శాశ్వత ఉద్యోగులు ఉండగా... ఐఎస్‌పీలో 1700 మంది శాశ్వత ఉద్యోగులు ఉన్నారు.












Click it and Unblock the Notifications