శశికళ భర్త మృత్యువుతో పోరాటం: జైలు నుంచి బయటకు రాని చిన్నమ్మ, పెరోల్ కోసం కోర్టులో !

బెంగళూరు/చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పాలని ప్రయత్నించి చివరికి బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న శశికళ తన భర్త ఆసుపత్రిలో మృత్యువుతో పోరాటం చేస్తున్నా ఆమె పెరోల్ కు పిటిషన్ దాఖలు చెయ్యకపోవడంతో తమిళనాడు ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

కిడ్నాలు, లివర్ తదితర అవయవాలు పాడైపోవడంతో తీవ్ర అనారోగ్యానికి గురైన శశికళ భర్త నటరాజన్ కు కొంత కాలంగా చెన్నైలోని గ్లోబల్ హెల్త్ సిటీ ఆసుపత్రిలో ఐసీయులో చికిత్స చేస్తున్నారు. నటరాజన్ ఆరోగ్య పరిస్థితి చాల విషమంగా ఉందని ఇటీవల గ్లోబల్ హెల్త్ సిటీ ఆసుపత్రి వర్గాలు బులెటెన్లు విడుదల చేశారు.

Natarajan hospitalized VK Sasikala not asking parole

భర్త ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని జైల్లో ఉన్న శశికళకు మన్నార్ గుడి మాఫియా ఇప్పటికే సమాచారం ఇచ్చింది. శశికళ కచ్చితంగా పెరోల్ మీద జైలు నుంచి బయటకు వస్తారని మన్నార్ గుడి మాఫియా భావించింది. శశికళ మాత్రం బుధవారం వరకూ తన భర్తను చూడటానికి పెరోల్ ఇవ్వాలని న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చెయ్యలేదు.

శశికళ బంధువులు ఆసుపత్రిలో నటరాజన్ కు తోడుగా ఉంటున్నారు. టీటీవీ దినకరన్ వర్గపోరు రాజకీయాలు చేస్తూ ఆసుపత్రి వైపు కన్నెత్తి చూడటం లేదని ఆరోపణలు ఉన్నాయి. శశికళ ఎందుకు జైలు నుంచి బయటకు రావడం లేదని ఇప్పుడు ఆమె వర్గీయులు, మన్నార్ గుడి మాఫియా చర్చ మొదలు పెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+