చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శశికళ వెనక భర్తనే: మరో వ్యూహం కూడా, దూరంగా ఉండీ...

శశికళ సిఎం పీఠాన్ని దక్కించుకునే దాకా రావడం వెనక జరిగిన ప్రతి కదలికలోనూ నటరాజన్ వ్యూహం ఉన్నట్లు చెబుతున్నారు. ఆయనకు మరో వ్యూహం కూడా ఉందంటున్నారు.

By Pratap
|
Google Oneindia TeluguNews

చెన్నై: జయలలిత నెచ్చెలి శశికళ అన్నాడియంకె పార్టీ పగ్గాలు చేపట్టి, ముఖ్యమంత్రి పీఠం దాకా రావడానికి తెర వెనక కథ నడిపించింది ఆమె భర్త నటరాజన్ అనే ప్రచారం జరుగుతోంది. పోయెస్‌గార్డెన్‌కు దూరంగా ఉంటున్నా కూడా శశికళ జయలలిత వారసురాలిగా ముందుకు రావడానికి ఆయనే కీలక పాత్ర పోషించారనే మాట వినిపిస్తోంది. జయలలిత డిసెంబరు 5న మరణించారు. ఆ తర్వాత ఆమె అన్నాడియంకె పగ్గాలు చేపట్టారు.

చివరకు ఫిబ్రవరి 5 నాటికి ఆమె నెచ్చెలి శశికళ అన్నాడీఎంకే శాసనసభపక్ష నేతగా ఎన్నికయ్యారు. అన్నాడీఎంకేలోని ఓ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా కూడా శశికళ రాజకీయంగా ఒక్కొక్క మెట్టే అధిరోహిస్తూ ముందుకు సాగడం వెనక నటరాజన్ పాత్ర కీలకమైందని అంటున్నారు.

<strong>మీరు వద్దు, మీ పదవి వద్దు, రాజకీయాలే వద్దు: పన్నీర్ సెల్వం</strong>మీరు వద్దు, మీ పదవి వద్దు, రాజకీయాలే వద్దు: పన్నీర్ సెల్వం

నిజానికి, ఆయన రాజకీయాలకు కొత్త కాదు. తంజావూరు జిల్లా విళార్‌ గ్రామానికి చెందిన నటరాజన్‌ మొదట్లో డీఎంకే కార్యకర్తగా పని చేశారు. 1965లో హిందీ వ్యతిరేక ఉద్యమంలో క్రియాశీలకంగా వ్య.వహరించారు. ఎల్‌.గణేశన్‌ మద్దతుదారునిగా ఆయనకు అప్పట్లో పేరు ఉండేది.

తొలుత ఆయన కరుణానిధితో

తొలుత ఆయన కరుణానిధితో

కరుణానిధి తొలిసారి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టినప్పుడు పార్టీ ప్రముఖుల సహకారంతో పౌరసంబంధాల శాఖలో ఏపీఆర్వోగా నటరాజన్‌ ఉద్యోగంలో చేరారు. తర్వాత శశికళతో పెళ్లి జరగింది. ఈ వివాహం కార్యక్రమం కరుణానిధి అధ్యక్షతన జరిగింది. ఎంజీఆర్‌ హయాంలో చెన్నైలో పని చేస్తుండగా రాజకీయ నేతలు పరిచయమవుతూ వచ్చారు.

జయలలిత వద్దకు శశికళ ఇలా..

జయలలిత వద్దకు శశికళ ఇలా..

అప్పటి ముఖ్యమంత్రి, అన్నాడియంకె వ్యవస్థాపకుడు ఎంజి రామచంద్రన్‌తో జయలలితకు సన్నిహిత సంబంధాలు అన్న విషయం ఆయనకు తెలుసు. దాంతో జయలలిత చెంతకు శశికళను పంపిండంలో ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరించారు. దాంతో జయలలిత, శశికళ మధ్య విడదీయనిరాని బంధం ఏర్పడింది. దాంతో కీలక పరిణామాలు సంభవించాయి. ఆ పరిణామాల వెనక శశికళ హస్తం ఉందని అంటారు.

జయలలిత వెళ్లగొట్టిన తర్వాత

జయలలిత వెళ్లగొట్టిన తర్వాత

పోయెస్‌గార్డెన్‌ నుంచి శశికళ, ఆమె కుటుంబ సభ్యులను జయలలిత వెళ్లగొట్టారు. కొన్ని పరిణామాల నేపథ్యంలో జయలలిత ఆ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత తన భర్త నటరాజన్‌ను, ఇతర బంధువులను దూరంగా ఉంచి శశికళ మళ్లీ జయలలిత పంచన చేరారు. జయలలిత మరణం తర్వాత శశికళను వ్యూహాత్మకంగా నడిపించడంలో నటరాజన్‌ ప్రముఖపాత్ర పోషించినట్లు చెబుతారు. పోయెస్ గార్డెన్‌కు దూరంగా ఉంటూనే ఆ పని వ్యూహాత్మకంగా చేసిపెట్టినట్లు చెబుతారు.

నటరాజనే పావులు కదిపారు...

నటరాజనే పావులు కదిపారు...

పార్టీ నాయకత్వాన్ని శశికళ చేపట్టాలని కొంత మంది రాష్ట్రమంత్రులు, సీనియర్‌ నేతలు ప్రకటనలు చేయడం వెనక నటరాజన్ పాత్ర ఉందని అంటారు. ఆదివారం జరిగిన అన్నాడీఎంకే శాసనసభ పక్ష సమావేశం శశికళను నేతగా ఎన్నుకోవడం వెనక కథనంతా నడిపించింది ఆయనే అని చెబుతారు.

నటరాజన్ మరో వ్యూహం...

నటరాజన్ మరో వ్యూహం...

జయలలిత తనను బహిష్కరించిన విషయం ఇంకా పార్టీ నాయకుల్లో, కార్యకర్తల్లో అలాగే ఉండడం వల్ల ఆయన తెరవెనుక నుంచి భార్యను నడిపిస్తున్నారని అంటున్నారు. శశికళపై కొన్ని కేసులు ఉన్న విషయం తెలిసిందే. ఆ కేసుల కారణంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి పదవి నుంచి శశికళ తప్పుకోవలసి వస్తే తెర ముందుకు రావడానికి కూడా ఆయన పథక రచన చేసుకున్నట్లు ప్రచారం సాగుతోంది.

English summary
It is said that Natarajan is playing key role in sasikala's rise AIDMK after Jayalalithaa's death in Tamil Nadu politics
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X