సినిమా హాళ్లలో జాతీయ గీతం: సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
Recommended Video

సినిమా హాళ్లలో 'నో ' జాతీయ గీతం
న్యూఢిల్లీ: సినిమా హాళ్లలో జాతీయ గీతం తప్పనిసరి కాదని సుప్రీం కోర్టు తెలిపింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరించింది. 2016 నవంబర్ 30వ తేదీన సినిమా హాళ్లలో జాతీయ గీతాలాపన తప్పనిసరి అని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.
దీంతో అప్పటి నుంచి సినిమా హాళ్లలో దీనిని ఆలపిస్తున్నారు. ఈ అంశంపై కేరళకు చెందిన ఓ సంస్థతో పాటు పలువురు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఇప్పుడు న్యాయస్థానం గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరించింది.

సినిమా హాళ్లలో జాతీయ గీతాన్ని తప్పనిసరి చేయడంపై విమర్శలు కూడా వచ్చాయి. కేంద్రం కూడా దీనిని పునఃపరిశీలించాలని సుప్రీం కోర్టును కోరింది. ఈ నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు ఇచ్చింది.












Click it and Unblock the Notifications