వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

National Doctors Day 2021 -జులై 1నే ఎందుకో తెలుసా? -మెడికల్ స్టాఫ్‌కు ప్రధాని మోదీ సందేశం

|
Google Oneindia TeluguNews

మనిషి రూపంలోని దేవుళ్లుగా వైద్యులు ప్రజల నుంచి మన్ననలు పొందుతారు. ప్రస్తుత కరోనా విలయకాలంలో తమ ప్రాణాలను పణంగాపెట్టి పోరాడుతున్నారు మెడికల్ సిబ్బంది. గురువారం నాటి జాతీయ డాక్టర్ల దినోత్సవం సందర్భంగా యావత్ దేశం వైద్యుల సేవలను మరోసారి స్మరించుకోనుంది. వైద్య సిబ్బందిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ కీలక సందేశం వెలవరించనున్నారు.

మన దేశంలో ప్రతి ఏటా జులై 1న జాతీయ వైద్యుల దినోత్సవాన్ని నిర్వహిస్తుండటం ఆనవాయితీ. భారతరత్న డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ జయంతి సందర్భంగా ఆ రోజును డాక్టర్స్ డేటా పాటించే సంప్రదాయం మూడు దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తీర్మానం మేరకు 1991 నుంచి ఏటా జులై 1ని జాతీయ వైద్యుల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.

జగన్ దెబ్బకు కదిలిన మోదీ: వ్యాక్సిన్ల పంపిణీపై కేంద్రం కీలక సవరణలు -ప్రైవేట్ ఆస్పత్రులకు భారీ షాక్జగన్ దెబ్బకు కదిలిన మోదీ: వ్యాక్సిన్ల పంపిణీపై కేంద్రం కీలక సవరణలు -ప్రైవేట్ ఆస్పత్రులకు భారీ షాక్

డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ 1882 జూలై 1న జన్మించి, 1962 జూలై 1న మరణించారు. 80ఏళ్ల వయసులో ఆయన పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగానూ పనిచేశారు. ఆయన బతికుండాగానే, 1961 ఫిబ్రవరి 4న భారత ప్రభుత్వం డాక్టర్ రాయ్ కి దేశ అత్యున్నత పౌర పురస్కారం, భారతరత్నతో సత్కరించింది. దేశంలో వైద్య రంగం విస్తృతికి కృషిచేసిన ఆయన జయంతినే జాతీయ వైద్యుల దినోత్సవంగా జరుపుకొంటారు.

National Doctors Day 2021: History and Significance, PM Modi to address on july 1

నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా సమాజంలో డాక్టర్లు చేస్తోన్న సేవలు, కృషి గురించి ప్రత్యేక కార్యక్రమాలు, చర్చ జరగడం, వైద్యులకు గ్రీటింగ్స్ తెలుపుతుంటారు. సాధారణరోజుల్లోనైతే ర్యాలీలు, సభలు కూడా జరుగుతాయిగానీ, కరోనా కారణంగా ఈ ఏడాది కూడా డాక్టర్స్ డే నిరాడంబరంగా జరుగనుంది. కరోనాపై పోరులో చనిపోయిన వేలాంది మంది డాక్టర్లకు రేపు నివాళులు అర్పించనున్నారు. కాగా,

బీజేపీ బరితెగింపు: రైతులపై దాడి -ఢిల్లీ సరిహద్దులో టెన్షన్ -తోలు ఒలుస్తామంటూ టికాయత్ వార్నింగ్బీజేపీ బరితెగింపు: రైతులపై దాడి -ఢిల్లీ సరిహద్దులో టెన్షన్ -తోలు ఒలుస్తామంటూ టికాయత్ వార్నింగ్

జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా గురువారం వైద్యులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) నిర్వహిస్తోన్న కార్యక్రమంలో రేపు మధ్యాహ్నం 3 గంటలకే మోదీ ప్రసంగిస్తారు. కొవిడ్-19పై పోరాటంలో వైద్యుల కృషికి దేశం గర్విస్తున్నదని మోదీ బుధవారం ట్వీట్ చేశారు.

భారత్ లో డాక్టర్స్ డేను జులై 1న నిర్వహిస్తుండగా, ప్రపంచంలోని ఇతర దేశాల్లో వేర్వేరు తేదీల్లో జరుపుకొంటారు. అమెరికాలో డాక్టర్స్ డేను మార్చి 30న నిర్వహిస్తారు. డాక్టర్ల కార్ఖానా క్యూబాలో డిసెంబర్ 3ను డాక్టర్స్ డేటా పాటిస్తారు. ఇరాన్ లో ఆగస్టు 23న డాక్టర్స్ డే జరుపుతారు.

English summary
Each year National Doctors Day is celebrated on July 1 in India. This day is marked to acknowledge and celebrate the efforts that medical professionals put for the health, wellbeing and safety of other people. The day celebrates the incessant work put in by medical professionals throughout their careers to save human lives. Prime Minister Narendra Modi is scheduled to address the medical fraternity on Thursday to mark the National Doctor's Day in the country amid coronavirus disease (Covid-19) outbreak.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X