వాస్తు చెబుతోంది.. ఎండిపోయిన తులసి లక్ష్మీదేవిని తెస్తుంది అని!

హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు ఉన్న స్థానం అద్వితీయం. కేవలం ఒక మొక్కగానే కాకుండా, తులసిని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా, మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన 'తులసి దేవి'గా మనం పూజిస్తాం. అందుకే, ఇంట్లో తులసి కోట పచ్చగా ఉన్నప్పుడే కాదు... ఒకవేళ వాతావరణ మార్పుల వల్ల అది ఎండిపోయినా కూడా దానికి అంతే గౌరవం ఇవ్వాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎండిన తులసిని నిర్లక్ష్యంగా పారేయడం వల్ల ఇంట్లో ప్రతికూలత పెరుగుతుందని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పవిత్ర జలాల్లో నిమజ్జనం

తులసి ఎండిపోయినప్పటికీ దానిలోని పవిత్రత అస్సలు తగ్గదు. అందుకే దాన్ని ఎక్కడపడితే అక్కడ, చెత్తబుట్టల్లో పడేయకూడదు. ఎండిన తులసి మొక్కను వేళ్లతో సహా తీసి, సమీపంలోని ఏదైనా నదిలో లేదా పవిత్రమైన జలాశయంలో గౌరవంగా నిమజ్జనం చేయడం అత్యంత శ్రేయస్కరం. వైష్ణవ సంప్రదాయంలో తులసి మాల ధరించడానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎండిన తులసి కాండాన్ని సేకరించి, శుభ్రం చేసి, గంగాజలంతో ప్రోక్షించాలి. ఆపై దాన్ని చిన్న చిన్న పూసలుగా చేసి దండగా మార్చుకుని మెడలో ధరించవచ్చు. ఇది మనసుకు అపారమైన ప్రశాంతతను ఇస్తుంది, సానుకూల ఆలోచనలను పెంపొందిస్తుంది. అయితే, తులసి దండ ధరించినప్పుడు పరిశుభ్రత, సత్యసంధత వంటి నియమాలను పాటించడం తప్పనిసరి.

Vastu says that a dried-up Tulasi plant brings Goddess Lakshmi

పూజా గదిలో భద్రత

ఎండిపోయిన తులసి ఆకులను లేదా చిన్న చిన్న కొమ్మలను పారేయకుండా, ఒక ఎర్రటి వస్త్రంలో కట్టాలి. ఈ మూటను మీ పూజా మందిరంలో ఉంచడం వల్ల ఇంట్లో ఎప్పుడూ ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఎర్రటి గుడ్డలో కట్టిన ఎండిన తులసి ఆకుల మూటను ఇంటి సింహద్వారం పైభాగాన వేలాడదీయాలి. ఇలా చేయడం వల్ల ఎలాంటి నెగటివ్ ఎనర్జీ, దిష్టి లేదా ప్రతికూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశించలేవు. ఇది ఇంటికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది.

హోమాలు, యజ్ఞాలలో సమర్పణ

ఇంట్లో లేదా గుడిలో ఎక్కడైనా హోమాలు, యజ్ఞాలు, హవనాలు జరుగుతున్నప్పుడు.. ఎండిన తులసి ఆకులను, కొమ్మలను అందులో ఆహుతిగా సమర్పించవచ్చు. తులసి కాష్టం కాలడం వల్ల వచ్చే పొగ వాతావరణాన్ని పవిత్రం చేయడమే కాకుండా, దేవతల అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. ఎండిన తులసి కొమ్మలను లేదా ఆకులను కాస్త నలిపి, దూదితో కలిపి 'తులసి వత్తులు' తయారు చేసుకోవచ్చు. ఈ వత్తులతో నెయ్యి దీపం వెలిగించి పూజ చేయడం వల్ల ఇంట్లోని దరిద్రం తొలగిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి, సంపదతో పాటు కుటుంబంలో సుఖసంతోషాలు, ఐశ్వర్యం వెల్లివిరుస్తాయి. తులసి జీవంతో ఉన్నప్పుడే కాదు, ఎండిపోయిన తర్వాత కూడా మన జీవితాల్లో సానుకూలతను నింపే అద్భుత శక్తి దానికి ఉంది. కాబట్టి, సృష్టి మనకిచ్చిన ఈ పవిత్ర వరాన్ని గౌరవిద్దాం, సంప్రదాయాలను పాటిద్దాం!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+