నేషనల్ హెరాల్డ్ కేసుది చిన్న కథ కాదే: దొరికేట్టున్నారు
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎదుర్కొంటోన్న నేషనల్ హెరాల్డ్ కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. వీళ్లద్దరి పేర్లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్‌షీట్‌లో పెట్టింది. 5,000 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను మళ్లించడానికి ప్రధాన సూత్రధారులుగా పేర్కొంది.
ఇది- కాంగ్రెస్ పార్టీ అవినీతి, అధికార దుర్వినియోగం, వంశపారంపర్య పాలనకు నిదర్శనమని భారతీయ జనత పార్టీ ఆరోపిస్తోంది. స్వాతంత్ర్యానంతరం ఈ కేసుకు బీజం పడిందని, దీని మూలాలు 1950 నాటివి అంటూ ఆ పార్టీ విమర్శిస్తోంది. అప్పుడే సర్దార్ వల్లభాయ్ పటేల్ హెచ్చరికలు జారీ చేశారని తెలిపింది.

సర్దార్ పటేల్స్ కరస్పాండెన్స్ పుస్తకంలో నమోదైన మే 1950 నాటి లేఖల్లో- నేషనల్ హెరాల్డ్‌ను నిధుల సేకరణ కోసం ఉపయోగించడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పలుకుబడిని ఉపయోగించి నిధులు సేకరించడంపై అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూను అప్రమత్తం చేశారు. అనుమానాస్పద లేదా అక్రమ మార్గాల ద్వారా వచ్చే నిధులను అంగీకరించవద్దని సూచించారు.
ఈ విషయంలో నెహ్రూ దాటవేత ధోరణిని అనుసరించారు. దీనిపై తనకు అవగాహన లేదని, దర్యాప్తు చేయిస్తానంటూ చెప్పడం వల్లభ్ భాయ్ పటేల్ అనుమానాలను మరింత బలపరిచింది. ఆర్థిక అవకతవకలు, అవినీతిపై పటేల్ చేసిన హెచ్చరికలను నెహ్రూ పెడచెవిన పెట్టారు.
ఇది కాంగ్రెస్ పార్టీ బాధ్యతారాహిత్యానికి, అహంకారానికి, అవినీతిమయ సంప్రదాయానికి దారితీసిందని విమర్శకులు అంటున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసు వెలుగులోకి వచ్చిన తరువాత- అప్పట్లో పటేల్ చేసిన హెచ్చరికలు నిజమయ్యాయని బీజేపీ నాయకులు అంటున్నారు. కార్పొరేట్ పునర్వ్యవస్థీకరణ పేరుతో కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఆరోపిస్తున్నారు.
చట్టపరమైన లొసుగులను ఉపయోగించి మూతపడిన నేషనల్ హెరాల్డ్ ఆస్తులను సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆధీనంలో ఉన్న యంగ్ ఇండియన్ లిమిటెడ్ రహస్యంగా స్వాధీనం చేసుకుందని ఈడీ తన ఛార్జిషీట్‌లో పేర్కొంది. ఇది ఆర్థికపరమైన పొరపాటు కాదని, వ్యక్తిగత లాభం కోసం రాజకీయ అధికారాన్ని దుర్వినియోగం చేయడమేనని ఆరోపిస్తోంది.
1950న హిమాలయన్ ఎయిర్‌వేస్ నుండి నేషనల్ హెరాల్డ్‌కు 75,000 రూపాయల విరాళం అందింది. దీనిపై నెహ్రూకు లేఖ రాశారు వల్లభ్ భాయ్ పటేల్. భారత వైమానిక దళం అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ- ప్రభుత్వ కాంట్రాక్ట్‌ను పొందిందీ సంస్థ అప్పట్లో. విరాళం ఇచ్చిన వారిలో ఒకరైన అఖాని.. బ్యాంక్‌ను మోసం చేసిన కేసును ఎదుర్కొంటోన్నారంటూ పటేల్ హెచ్చరించారు.
అంతేకాదు- జేపీ శ్రీవాస్తవ వంటి వివాదాస్పద వ్యాపారుల నుండి అప్పటి కేంద్రమంత్రి అహ్మద్ కిద్వాయ్ విరాళాలను సైతం స్వీకరిస్తున్నారని పటేల్ ఆరోపించారు. ఈ మేరకు 1950 మేలో ఓ లేఖ రాశారు. ఈ లేఖకు నెహ్రూ అదే రోజు అస్పష్ట సమాధానం ఇచ్చారు. ఈ విషయాన్ని తన అల్లుడు, అప్పటి హెరాల్డ్ జనరల్ మేనేజర్ ఫిరోజ్ గాంధీ చూసుకుంటారని ఆయన దాటవేశారు.

అప్పట్లో నెహ్రూ ఇచ్చిన ఈ సమాధానం నిర్లక్ష్యంతో కూడుకుని ఉన్నదని, అక్రమ లావాదేవీలు, ఆర్థిక అవకతవకల తీవ్రతను తగ్గించేలా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అప్పుడే నెహ్రూ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకుని ఉంటే నేషనల్ హెరాల్డ్ కుంభకోణం జరిగివుండేది కాదని అంటున్నారు.
నెహ్రూ రాసిన లేఖకు పటేల్ ఆ మరుసటి రోజే అంటే- మే 6వ తేదీన మరో ప్రత్యుత్తరం రాశారు. కొన్ని విరాళాలు ప్రైవేట్ కంపెనీలకు సంబంధించినవని, వాటిలో ఎలాంటి స్వార్థం లేదంటూ నెహ్రూ చేసిన వాదనను తిప్పికొట్టారు. ప్రైవేట్ కంపెనీలు ఇచ్చే విరాళాల్లో దయాగుణం అనే అంశమే లేదని ఖరాఖండిగా తేల్చి చెప్పారు.
పటేల్ లేఖపై నెహ్రూ మరోసారి స్పందించారు. మూడేళ్లుగా తాను పత్రిక ఆర్థిక వ్యవహారాల్లో లేనని, ఆ బాధ్యతను మృదులకు అప్పగించానని వివరించారు. కొన్ని పొరపాట్లు జరిగి ఉండవచ్చు అని అంగీకరించారు. ఇది లాభనష్టాలతో కూడిన వ్యాపారం కావడం వల్ల ఇందులో నైతికత, జవాబుదారీతనం ఉండదంటూ స్పష్టం చేశారు.

ఇప్పుడు తాజాగా ఈ కేసును బీజేపీ సీనియర్ నాయకుడు డాక్టర్ సుబ్రమణ్యస్వామి తవ్వి తీశారు. గాంధీ కుటుంబం ప్రభుత్వ ఆస్తులను స్వాహా చేయడానికి వ్యవస్థాగత కుట్ర పన్నారని ఆరోపిస్తూ వస్తున్నారు. ఆయన వాదనలు సైతం బీజేపీ చేస్తోన్న విమర్శలు, ఆరోపణలకు దగ్గరగా ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబ సంస్థలా పనిచేసిందని, రాజకీయ పలుకుబడిని వ్యక్తిగత లాభం కోసం ఉపయోగించుకుందనేది బీజేపీ ఆరోపణ. ఇది రాజకీయ కక్షసాధింపు చర్యగా కాంగ్రెస్ వాదిస్తోన్నప్పటికీ- చారిత్రక ఆధారాలు, ఈడీ ఛార్జిషీట్‌లో పొందుపర్చిన అంశాల ముందు నిలబడలేకపోతోంది. ఈ అంశాన్ని బీజేపీ అంత తేలిగ్గా వదలదలచుకోవట్లేదు.
చట్టపరమైన నేరంగా మాత్రమే కాకుండా.. కాంగ్రెస్‌ను అనుసరిస్తూ వస్తోన్న అవినీతిమయ విధానాలను తెరమీదికి తీసుకుని రావడానికి ఉపయోగించుకుంటోంది. ఇది కేవలం ఆర్థిక కుంభకోణం మాత్రమే కాదని, దశాబ్దాల తరబడి కొనసాగుతున్న వస్తోన్న అధికార దుర్వినియోగాన్ని ఆధునిక భారత పితామహుడిగా పేరు తెచ్చుకున్న నెహ్రూ సైతం పట్టించుకోకపోవడానికి నిదర్శనంగా చెబుతోంది.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications